పుట:ఏప్రిల్ 2021, అమ్మనుడి మాస పత్రిక.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చరిత్రగా మిగిలింది

సన్నిధానం నరసింహశర్మ 92920 55531


ఆగిన తెలుగు వెలుగు చిరస్మరణీయసేవలు

బావుటా చేబట్టిన ఈనాడు సంపాదకులు సుప్రసిద్ధులు శ్రీ రామోజీరావు


ఒక పని ఆగితే ఒక వ్యక్తికి నష్టం కావచ్చు,

ఒక పని అగితే ఒక సంస్థకు నష్టం రావొచ్చు.

కానీ ఒక పది మందికి అవసరమైన పని ఆగితే యావత్తు సమాజానికీ నష్టం- పూడ్చలేని నష్టం ప్రస్ఫుటమవుతుంది. రామోజీ ఫౌండేషన్‌ వారు కొన్ని ప్రమాణాలతో నడిపిన 'తెలుగు వెలుగు” అగిపోయిందన్న వార్త చెవులబడినప్పుడు - భాషా సాహిత్యాభిమానులు అ సామాజిక నష్టాన్ని అనుభూతిచెందారు.

చతుర, విపుల నవలాసాహిత్యానికి, కథాసాహిత్యానికి అనువాదాలకు చేసిన దోహదం అసామాన్యమైనది. 1978 నుండీ కొనసాగి అవి ఇప్పుడు ఆగాయి.

ప్రొద్దుటే లేవగానే సూరీడునీ ఈనాడునూ చూడకపోతే ఇదై పోయేవారు అసంఖ్యాకులు. రామోజీరావుగారి దార్శనిక దృష్టివల్ల, వ్యాపార సృజనాత్మకతల వల్ల రాష్ట్రంలో వేలమందికి ఉపాధి ఏర్చడడం మరువరానిది. క్రొత్తగా “బాలభారతం” అని పిల్లల పత్రిక పెడితే అది లక్షా యిరవై వేల పైబడి పంపిణీ స్థాయికి ఎదిగిందంటే శ్రీ రామోజీరావు మార్గర్శకత్వం, అంకితభావాలు గల ఆయన సహచర ఉద్యోగుల శ్రమతత్వం ఎన్నో ఆంతరంగీకంగా ఉన్నాయి. ఒక పెద్ద నిఘంటువును తెలుగు జాతికి అందించాలని లక్షల రూపాయలు వెచ్చిస్తూ ఒక అవిచ్చిన్న భాషా సేవ కొనసాగిస్తున్న శ్రీ రామోజీరావు గారి పాత్రను మరువలేం.

వ్వవసాయ ప్రధానమైన, అన్నపూర్ణకి అక్షయపాత్ర వంటి అన్నదాత పత్రికను ప్రదానం చేసిన క్రొత్త చూపు శక్తి- శ్రీ రామోజీరావుగారిది.

బాలబాలికల్లో సృజనాత్మక పెంపుదలకు, ఆహ్హాదాన్ని కలగజేయడానికి, అధునిక వైజ్ఞానిక సమాజ అనుగుణ ఆలోచలనలను పెంపొందించడానికి పిల్లల పత్రిక- “బాలభారతం'ని అభివృద్ధిపరిచారు. అదీ కాలీన పత్రికా జీవనపరిస్థితులను బట్టి ఆగిపోయింది.

ఎంత మందికో బ్రతుకుదన్నులిచ్చిన పత్రికలుగా ఆగిపోవడం తప్పని పరిస్థితుల్లోనే అయినా ఆ ప్రభావం ఎన్నో కుటుంబాలపై పడింది.

కొన్ని దినపత్రికలలో వివిధ సాహిత్య శీర్షికలు ఏదో ఒక రోజైనా వారపు విందులు చేస్తున్న సందర్భంలో ఈనాడులో అటువంటి సాహిత్యపు పుట లేదని లోటుగా సాహితీజనులు కొందరు అనుకోవడం ఉండేది. అటువంటి సందర్భంలో ప్రత్యేకంగా “తెలుగువెలుగు” అనే భాషాసాహిత్య పత్రికను శ్రీ రామోజీరావుగారు ప్రధాన సంపాదకులుగా కొన్నేళ్లు ప్రామాణిక పద్ధతుల్లో నడపడం తెలుగు పత్రికా చరిత్రలో ఒక మహాదర్శం. తెలుగువెలుగు ఆయన కలల వెలుగు. ప్రణాళికాబద్ధంగా ఆలోచించి 2012 సంవత్సరంలో సెప్టెంబరు తొలి సంచికగా ప్రారంభించి, 2021వ సంవత్సరం మార్చి సంచిక వరకూ నిర్వహించారు. 103 సంచికలు సర్వాంగ సుందరంగా తెలుగు నాట మూడు ప్రాంతాల ప్రాతినిధ్యమూ సహజంగా ఉండేల చూసుకుంటూ నడిపారు. శతాధిక మాస భాసమైన ఈ తెలుగు పత్రికా ప్రస్థానంలో ఎన్నో శక్తిమంతమైన రచనలు! ఆసక్తి

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఏప్రిల్‌-2021

16