పుట:ఏప్రిల్ 2021, అమ్మనుడి మాస పత్రిక.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


విజయవంతంగా అమలుపరచడంలో విఫలమై చతికెలపడిందని చెప్పొచ్చు. ఏది ఏమైనప్పటికీ, బ్రిటీష్‌ వారు రూపొందించిన ఇంగ్లీష్‌ మాధ్యమ విద్య నుండి బయటకు వచ్చి - స్థానిక భాషలో విద్యను అందించే ఆలోచన చేయడం హర్షణీయం. కానీ, ప్రభావవంతంగా ఈ సూత్రాన్ని అమలు చేసి, స్టానిక భాషల్లో విద్యను అందించినట్లయితే ఫలవంతంగా ఉండేది. విద్యా నాణ్యతా, బొధనా పద్దతులూ ఆశించిన విధంగా లేకపోవడం వల్ల విద్యార్థుల ఫలితాలు పాఠశాలలో నిరాశ పరిచే విధంగా ఉన్నాయని 2018 వ సంవత్సరం లో విడుదల చేసిన ప్రపంచ బ్యాంకు గణాంకాలలో తేలింది. విద్యార్థుల అంతర్జాతీయ పరీక్షా ఫలితాలను ప్రపంచ దేశాలతో పోల్చి చూసినప్పుడు, నిరంతరం యుద్ద వాతావరణం గడిపే ఆష్థనిస్తాన్‌తో సమానంగా మన దేశ ఫలితాలు ఉండటం విచారకరం. సగటున వేయికి 400 ఉంటే, భారతదేశంలోని విద్యార్థుల ఫలితాలు 355 సంఖ్యలో ఉన్నాయి.

నూతన విద్యా విధానం -2020:

భారతీయ భాషలను ఒక అంశంగా కాకుండా- విద్యా మాధ్యమంగా చేయడం పూర్తిగా వలసవాదపు భావాలకు విభిన్నంగా ఉండటం గొప్ప విషయం. విద్యను వలసవాద నీడల నుండి స్వతంత్ర పరిచినట్టు ఉన్నది. అమ్మనుడులను బోధనా మాధ్యమంగా 29జులై 2020నుండి అమలు పరుస్తూ. ..”సాధ్యమైన చోట, కనీసం 5 వ తరగతి వరకు, కానీ 8 వ తరగతి వరకు, అంతకు మించి ఇంటిభాష/ మాతృభాష / స్థానిక భాష / ప్రాంతీయ భాష బోధనా మాధ్యమంగా ఉంటుంది” అని స్పష్టం చేసింది. దీనికి గల ప్రథాన కారణం బహుభాషావాదాన్ని ప్రోత్సహించడంతోపాటు, జాతీయ ఐక్యతను ప్రోత్సహించడం కోసం. ఈ విధానంలో మూడు భాషలు ఎంపికకు వీలు ఉన్నా, అందులో రెండు భారతదేశానికి చెందినవే అవ్వాలి. అయినప్పటికీ ఏ భాష కూడా బలవంతంగా విద్యార్థులపై గతంలో లాగా రుద్దదని - మానవ వనరుల అభివృద్ది విద్యా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. నూతన విద్యా విధానం 2020లో భారతీయ సంస్కృతిని పాఠశాల విద్యలో ప్రతిబింబించేలా పాఠ్యప్రణాళికలు రూపొందించడం ప్రధానాకర్షణగా నిలుస్తోంది. ఇందులో కొన్ని విషయాలు మెరుగుపరచవలసినవి ఉన్నా పూర్తి స్థాయిలో ఇది ఎటువంటి ఫలితం తీసుకుంటుందో చూడాలి.

ఈ వ్యాసరచయిత పరిశోధక విద్యార్థి, హైదరాబాదు విశ్వవిద్యాలయం.


మాతృభాషలో చదివిన పిల్లలు, ఇతర భాషలో చదివిన పిల్లలకంటే మెరుగుగానూ, త్వరగానూ నేర్చుకొంటారు. ఇంటి భాషలో చదివిన పిల్లలు, తర్వాత పాఠశాలలో పరీక్షలలో పనితీరు బాగుంటుంది. ప్రతిభా నైపుణ్యాలకు మించి ప్రయోజనాలతో బాటు మెరుగైన ఆత్మనిర్భరత, ఆత్మగౌరవం, ఆత్మధైర్యం అలవడతాయి -యునెస్మో

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఏప్రిల్‌-2021

15