పుట:ఏప్రిల్ 2021, అమ్మనుడి మాస పత్రిక.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రాంతీయ భాషల్లో ఇంజనీరింగ్‌ అనేది ఐఐటీల నాశనానికి నాంది అని పేర్కొన్నాడు. బొథనా సిబ్బంది ఎంపికకి ప్రస్తుతం కేవలం విషయ పరిజ్ఞానం ఒక ప్రాతిపదిక. ప్రాంతీయ భాషల్లో బోధించే సిబ్బందిని ఎంపిక చేయాలంటే, ఆ భాషలో నైపుణ్యత ఉన్నవారినే ఎంచుకోవాలి. అలాంటి వారిలో విషయ పరిజ్ఞానం పెద్దగా ఉండదు, అందువల్ల ఐఐటీ బోధనా సిబ్బంది నాణ్యత దెబ్బ తింటుంది. ఆ విధంగా ఈ చర్య ఐఐటీల ముగింపుకి మొదటి అడుగవుతుంది.

ఇంటర్‌ వరకు పూర్తి తెలుగు మాధ్యమంలో చదివి ఆపై ఐఐటీకి వచ్చిన రావు మాత్రం జేఈఈ(ఐఐటీల్లో చేరేందుకు రాసే అర్హత పరీక్ష) మాతృభాషల్లో ఉండాలని అంటున్నాడు.

ఒకసారి ఐఐటీ లో చేరాక విద్యార్థులు సహాయక జట్టులుగా ఏర్పడి ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఆంగ్ల భాషపై పట్టు సాధించాలి అని ఆయన అభిమతం.

“మనం ప్రపంచ స్థాయి ఇంజనీర్లను తయారు చేస్తున్నాం. తమిళనాడు కోసమో, ఆంధ్ర కోసమో కాదు!” అని ఆయన అభిప్రాయం.

“మొదటి ఏడాది, మొదటి సెమెస్టర్‌ లో కొన్ని సబ్లెక్టులు కావాలంటే ప్రాంతీయ భాషల్లో బొధించవచ్చేమో కానీ, సాంతం బీటెక్‌, ఎంటెక్‌ ప్రాంతీయ భాషల్లో బోధించడం కష్టం అని ఆయన అభిప్రాయం.

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, ఈ పార్టీకి సిద్ధాంతపరంగా వెనుక ఉన్న రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్ చాలా ఏళ్ళుగా విద్య ప్రాంతీయ భాషల్లో ఉండాలని సైద్ధాంతికంగా నమ్ముతున్నారు. ముఖ్యంగా సాంకేతిక విద్య భారతీయ భాషల్లో ఉండాలన్నది వీరి సంకల్పం, 2016లో ఆరెసెస్‌ నేతృత్వంలో ఒక అభ్యర్థన ద్వారా ప్రాంతీయ భాషల్లో సాంకేతిక విద్య ఉండాలని పట్టుబట్టి అప్పటి మానవవనరులశాఖ(ప్రస్తుతం విద్యా శాఖ) మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ కి వినతిపత్రం ఇచ్చారు. ఐఐటీల్లో ఐఐఎంలలో, ఇంకా కేంద్ర ప్రభుత్వ నిధులతో నడుస్తున్న ఉన్నత విద్యా సంస్థల్లో ప్రాంతీయ భాషల్లో విద్య ఉండాలని. విద్యా విధాన చట్టంలో ప్రాంతీయ భాషల్లో సాంకేతిక విద్య అంశం జోడించడంలో ఈ వినతిపత్రం ముఖ్యంగా చెప్పుకోవాలి.

మార్చి 26 నాటికి వివిధ ఉన్నతవిద్యాసంస్థల అభ్మిపాయాలను సేకరించిన కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ, ఆ అభ్యర్థనలలోని కొన్ని విషయాలను బహిర్గతం చేసింది.

ప్రాంతీయ భాషల్లో ఇంజనీరింగ్‌ విద్యను అందించేందుకు అనువుగా ఉన్నత విద్యాసంస్థలను సన్నద్ధం చేసేందుకు, వారి అభిప్రాయాలు సేకరించేందుకు రెండు పేనళ్ళను కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ నియమించింది. ఇందులో మొదటి పేనల్‌ ఏఐసీటీ ఈ(అఖిల భారత సాంకేతిక విద్యా సంస్థ) నేతృత్వంలో ఉంది. ఈ పేనల్‌ తన అధీనంలో ఉన్న అన్ని ఇంజనీరింగ్‌ కళాశాలల్లో, సంస్థల్లో, విశ్వవిద్యాలయాల్లో ప్రాంతీయ. భాషల్లో ఇంజనీరింగ్‌ విద్యను అందించేలా మార్గదర్శకాలు జారీ చేస్తూ ప్రాంతీయ భాషల్లో ఇంజనీరింగ్‌ విద్యకు అనుకూలంగా నడుచుకుంది.

ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి అమిత్‌ ఖరే నేతృత్వంలో ఐఐటీల్లో, ఎన్‌ఐటీల్లో ప్రాంతీయ భాషల్లో సాంకేతిక విద్య సాధ్యాసాధ్యాల బేరీజుకు రెండవ పేనల్‌ ఏర్పరచబడింది. ఈ పేనల్‌ ఇంకా తన అభిప్రాయం చెప్పలేదు. ఈ పేనల్‌ కు ఐఐటీల తరఫు నివేదిక భారతీయ భాషల్లో ఇంజనీరింగ్‌ అందించడం కష్టమని, అందుకు ఐఐటీలు ఇప్పుడప్పుడే సన్నద్ధంగా లేవని చెప్పింది. అయితే ప్రాంతీయ భాషల్లో చదువుకుని వచ్చే విద్యార్థులు ఆంగ్ల మాధ్యమ స్థాయిని అందిపుచ్చుకునేలా ఆంగ్ల నైపుణ్య బోధన చేయగలమని ఐఐటీల నివేదిక తెలిపింది. ఇదే పేనల్‌ కు ఎన్‌ఐటీల తరఫున అందిన నివేదిక ప్రాంతీయ భాషల ఇంజనీరింగ్‌ విద్యకు సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది.

ఐఐటీ తరఫు నివేదిక సమర్పించిన వారి ప్రకారం ఐఐటీల్లో వచ్చి చేరే విద్యార్దులు వివిధ భాషల వారుంటారు. ఒక ప్రాంతీయ భాషలో బోధన మొదలుపెడితే, మిగితా భాషల వారికి అన్యాయం చేసినట్టు ఔతుందని వారి అభిప్రాయం.

ఐఐటీల్లోలా కాకుండా ఎన్‌ఐటీల్లో 50% ప్రాంతీయ విద్యార్దులు చేరతారు. అందువలన ప్రాంతీయ భాషలో ఇంజనీరింగ్‌ సబ్జెక్టుల బోధన ఎన్‌ఐటీల్లో పెద్ద ఇబ్బంది కాకపోవచ్చు. ఎన్‌ఐటీ భోపాల్‌ అలాహాబాద్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, జైపూర్లు ఈ విధానాన్ని స్వాగతిస్తూ ప్రాంతీయ భాషా ఇంజనీరింగ్‌ బోధనకు తాము సిద్ధమని తెలిపారు.

ఏఐసీటీఈ వారు ఆంగ్లంలోని పాఠ్యాంశాలను ప్రాంతీయ భాషల్లోకి అనువదించే పలు యాంత్రిక అనువాద ఉపకరణాలను అభివృద్ధి చేసినట్టు తెలుస్తోంది. సంస్ద ఇప్పటికే మొదటి, రెండవ సంవత్సర ఇంజనీరింగ్‌ పాఠ్యాంశాలను ఎనిమిది భారతీయ భాషల్లోకి సమర్ధవంతంగా అనువదించి అందుబాటులో ఉంచిందట. కేవలం ఒక 5% మానవ తనిఖీ జరిగితే చాలు, ఇవన్నీ నేరుగా తరగతి గదిలో వాడుకోవచ్చు. ఫార్ములాలు, గణిత, భౌతికశాస్త్ర ఈజ్వేషన్లు ఈ ఉపకరణాల ద్వారా అన్ని భారతీయ భాషల్లోకి తర్షుమా ఐపోతాయట.

ఇప్పటికే ఇంజనీరింగ్‌ విద్యార్దులకు అందుబాటులో ఉన్న స్వయం మొబైల్‌ ఆప్‌ లోని కొన్ని కోర్సులను యాంత్రిక అనువాదం ద్వారా అనువదించి నాణ్యతా పరీక్షలు చేస్తున్నారట.

ఏఐసీటీఈ చెయిర్మన్‌ అనిల్‌ సహ(స్రబుద్దె ఈ విషయాలను చెబుతూ, సాంకేతిక విద్య ప్రాంతీయ భాషల్లో బొధించడం కొత్తేం కాదని చాలా ఏళ్ళుగా రాజస్థాన్‌ లో హిందీలో, తమిళనాడులో తమిళంలో ఇంజనీరింగ్‌ డిప్లామా ఇస్తున్నారని, స్వాతంత్య్రానికి ముందు ఎన్నో సంస్థల్లో ఉర్జూలో సాంకేతిక విద్య ఉండేదని ఆయన చెప్పాడు.

మాతృభాషకాని భాషలో విద్యాభ్యాసం

విద్యార్థి చదువుకు అడ్డంకిగా మారుతుంది

- “యునెస్మో

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఏప్రిల్‌-2021

12