పుట:ఏప్రిల్ 2021, అమ్మనుడి మాస పత్రిక.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వాదన.

కొందరు ఆచార్యులు మాత్రం ఈ ప్రాంతీయ భాషల్లో ఇంజనీరింగ్‌ విద్యా బోధన చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తిరోగమనానికి నాందిగా, వెనుకబాటుతనం వైపు పోకడగా (a ery regressie and retrograde idea) చెబుతున్నారు.

ఐఐటీ బీహెచ్‌యు ఇప్పటికే మొదటి సంవత్సరం బీటెక్‌ కోర్సును హిందీలో ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం ప్రాంతీయ భాషల్లో ఇంజనీరింగ్‌ అందించే ఐఐటీలు, ఎన్‌ఐటీల జాబితా రూపొందిస్తోంది. ఈ ప్రాంతీయ భాషా తరగతులు ఇంతకు ముందున్న ఆంగ్ల భాషా తరగతులకు అదనంగా చేరుతున్నాయే తప్ప, ఆంగ్ల భాషను తీసివేసి ప్రాంతీయ భాషల్లో కోర్సులు ప్రవేశపెట్టడం లేదు. కొందరు మీడియా ఛానళ్ళ వారు మాత్రం ఆంగ్ల భాషను తీసివేసి ప్రాంతీయ భాషల కోర్సులతో భర్తీ చేస్తున్నట్టుగా దుష్ప్రచారం చేసారు.

ఒకానొక ఐఐటి సంచాలకుడు (చాటుగా, పేరు చెప్పకుండా) ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ, ఈ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల మొత్తం జోధనా సిబ్బంది విముఖంగా ఉన్నారని, ఇది విద్యను చిన్నచూపు చూడటం అని అతను ఎండకట్టాడు. ఐఐటీలకు ఉన్న ప్రాచుర్యాన్ని పేరు ప్రఖ్యాతులను- ఈ ప్రాంతీయ భాషల కోర్సుల ప్రవేశం నీరుగార్చుతుందని అతడు ఆందోళన వ్యక్తం చేసాడు. ప్రాంతీయ భాషల్లో ఇంజనీరింగ్‌ బోధన అసంభవం అని ఐఐటీ లాంటి జాతీయ సంస్థలో దేశం నలుమూలల నుండి వివిధ భాషలు మాట్లాడే విద్యార్థులు వచ్చి సమర్ధవంతంగా ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్నారని. ప్రాంతీయ భాషా బోధన విద్యార్థుల్లో అనవసరపు తారతమ్యాలు తెస్తుందని అతడి అభిప్రాయం. ప్రాంతీయ భాషల్లో ఐఐటీల్లో చేరేందుకు ఎంపిక పరీక్షలు ఉండటంలో అభ్యంతరం లేదు కానీ ఒక సారి ఐఐటీలో చేరిన విద్యార్థి ప్రపంచ స్థాయి నైపుణ్యం ఫొందాలంటే ఆంగ్ల మాధ్యమం అవసరమని అతడి అభిప్రాయం. ఐఐటీల్లో బిటెక్‌ ప్రాంతీయ భాషల్లో బోధించడం ఒక దుర్ఘటనగా అతడు వర్ణించాడు.

మరొక ఐఐటీ ప్రొఫెసర్‌ మాట్లాడుతూ, “ఐఐటీల్లో ఇంత హడావుడిగా ప్రాంతీయ భాషల్లో బోధన మొదలుపెట్టాలంటే ఉపాధ్యాయులను సన్నద్దం చేయటం కష్టం! ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఆంగ్ల మాధ్యమంలో సమర్ధవంతంగా బోధించగల ఆచార్యులను వెతకడమే మూడు చెరువుల నీరు తాగిస్తుంటే, ప్రాంతీయ భాషా బోధకులను ఇప్పటికిప్పుడు చేర్చుకుని, ఐఐటీ స్థాయికి వారు బోధించేలా తీర్చిదిద్దడం నేల విడిచి సాము చేయటం లాంటిది. నేను హిందీ మాధ్యమంలో చదువుకొని, ఆపై ఐఐటీ కాన్సూర్‌ విద్యార్థినయ్యాను. ఐఐటీలో ఉండగా హిందీపై పట్టు పోయింది. ఇప్పుడు హిందీలో ఇంజనీరింగ్‌ పాఠ్యాంశాలు బొధించమంటే, నేను బోధించలేను! నాణ్యమైన ఉపాధ్యాయులను వెతికి మరీ ఐఐటీల్లో జోధనా సిబ్బందిగా అతి కష్టం మీద తీసుకు రాగలుగుతున్నాము. విదేశాల నుండి ఇక్మడకు వచ్చే ఆచార్యులు ఈ రకమైన పరిణామాల వల్ల ఐఐటీల్లో చదివించడానికి సుముఖత చూపకపోవచ్చు.


ప్రపంచంలో వంద ఉత్తమ సాంకేతిక కళాశాలల్లో చేరేందుకు ఉబలాట పడుకున్న భారతీయ ఐఐటీల శ్రమను, ప్రాంతీయ భాషా ఇంజనీరింగ్‌ బోధన నీరుగాచ్చేన్తుంది. ఐఐటీల ఎంపిక - అది విద్యార్దుల ఎంపికైనా, బోధనా సిబ్బంది ఎంపికైనా - ప్రాంతీయ భాషల్లో ఇంజనీరింగ్‌ విధానం తేవడంతో నాసిరకంగా పరిణమిస్తుంది.”

“గత ఏడాది ఆర్థికంగా వెనకబడ్డ విద్యార్థుల రిజర్వేషన్‌ వల్ల పెరిగిన విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టు తరగతి గదులు లేక ఇబ్బంది పడుతుండగా, ఈ ప్రాంతీయ భాషల్లో ఇంజనీరింగ్‌ ఐఐటీల్లో మరిన్ని తరగతుల అవసరాన్ని కల్పిస్తుంది. ఒక్క ఏదాదిలో విద్యార్థులకు తగిన వసతులు ఏర్పాటు చేయటం పెద్ద సమస్యే

ప్రాంతీయ భాషల్లో సాంకేతిక విద్య అనగానే మన వారికి కొత్తగా పాఠ్య పుస్తకాలు రాయాలన్న అవసరం కన్నా ఉన్న ఆంగ్ల పాఠ్యపుస్తకాలను ప్రాంతీయ భాషల్లో తర్జుమా చేసెయ్యాలనే తోస్తుంది. ఎందుకంటే ఆ పని సులువు కనుక. ఒక ఇంజనీరింగ్‌ విద్యార్థి తరగతి గదిలో ప్రామాణిక పాఠ్య పుస్తకాలే కాకుండా, బయటి పుస్తకాలు ఎన్నో చదవాల్సి ఉంటుంది. ప్రధాన పాఠ్యపుస్తకం ఒక్కటి ప్రాంతీయ భాషలో రూపొందించి ఇవ్వటమే కష్టం అయితే, అదనపు రిఫరెన్స్‌ పుస్తకాలను ప్రాంతీయ భాషలో చదివే విద్యార్థులకు ఎలా అందించగలము? అలా అందించలేనప్పుడు, వారికి అన్యాయం చేస్తున్నట్టే.” అని మరో ప్రొఫెసర్‌ అన్నారు.

ఒక పేస్‌బుక్‌ పోస్టులో ఐఐటి ఖరగ్పూర్‌ సంచాలకుడు వీరేంద్ర కుమార్‌ తివారీ రాస్తూ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించాడు. ప్రతి సాంకేతిక విద్యా సంస్థలో ప్రాంతీయ భాషా హబ్‌ ఉండాలని. ఈ హబ్ బోధనాంశాలను, ఇతరత్రా విద్యార్థులకు అవసరమయ్యే బోధన సామగ్రిని ప్రాంతీయ భాషల్లో రూపొందించాలని ఆయన ప్రతిపాదించారు. ప్రత్యేక సంస్థలో వచ్చి చేరే విద్యార్థుల నేపథ్య భాషను అనుసరించి, అందుబాటులో ఉన్న సిబ్బంది సహకారంతో, విద్యార్థులు ముఖ్యంగా ఆంగ్ల భాష బొధనలో ఎదుర్కొన్న అంశాల ప్రాతిపదికన ఈ హబ్‌ లు పని చేయవచ్చని ఆయన అన్నాడు. ఐఐటీ ఖరగ్పూర్‌ లో ఇప్పటికే ఇలాంటి ఒక ప్రాంతీయ భాషా హబ్‌ బెంగాలీ, తెలుగు, హిందీ విద్యార్థులకు ఆసరాగా పని చేస్తోందని. కొన్ని ఎంపిక చేసిన సబ్జెక్టులకు ఈ సహకారం ఒడియా, తమిళంలో కూడా ఉందని ఆయన ఈ పోస్ట్‌లో పేర్కొన్నాడు.

మన ముందున్న వ్యక్తి ఏ భాషలో మాట్లాడుతున్నా మన భాషలోకి మార్చి వినిపించగల కృత్రిమమేధ సాంకేతికత అండతో మన భాషలో బోధించే సిబ్బంది లేకున్నా చక్కగా తరగతి గదిలో ఆంగ్లంలో చెప్పేదంతా మన మాతృభాషలో వినవచ్చు.

ఇలాంటి సాంకేతిక విష్ణవం వైపు ఇప్పటికే ఐఐటీ ఖరగ్పూర్‌ పనిచేస్తోందని వీరేంద్ర అన్నాడు.

ఐఐటీ గౌహతి సంచాలకులు గౌతం బరువా మాట్లాడుతూ, దీర్ధ కాలంలో ఇది సాధ్యమేమో కానీ, ఇంత తక్కువ వ్యవధిలో ప్రాంతీయ భాషల్లో ఇంజనీరింగ్‌ బోధన అసాధ్యమని అన్నాడు.

ఐఐటీ దిల్లీ డైరెక్టర్‌ రాంగోపాల్‌ రావు మాట్లాడుతూ ఐఐటీల్లో

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఏప్రిల్‌-2021

11