పుట:ఏప్రిల్ 2021, అమ్మనుడి మాస పత్రిక.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంగ్లంలో నేర్చుకున్నా పెద్ద తేడా ఉండదు అని అన్నాడు. పైగా మాతృభాషలో నేర్చుకున్న విద్యార్థి మెరుగైన ఆత్మవిశ్వాసంతో పని చేయగలడని అన్నాడు. ఉదాహరణగా తమిళనాడులోని ఏదైనా ఆటోముబైల్‌ తయారీ కంపెనీలో ఆంగ్ల భాషా నైపుణ్యం కన్నా ప్రాంతీయ భాషా నైపుణ్యం ఎక్కువ అవసరం అని అక్కడ ఉద్యోగాల్లో చేరిన పూర్వవిద్యార్థులు తెలిపారని ఆయన చెప్పాడు.

ప్రాంతీయ భాషల్లో బోధనలో ఏం చిక్కులున్నాయి?

బోధనకు కావాల్సిన పారిభాషిక పదాలు, బోధనా సామగ్రి, ఉపాధ్యాయుల్లో ప్రాంతీయ భాషా బోధనకు కావాల్సినంత ఆసక్తి ఉండటం మొదటి సవాలు. ఉద్యోగాల కల్చన రెండో సవాలు. పరిశోధనకు పెద్ద పీట వెయ్యాలంటే, పరిశోధనా పత్రాలను ప్రాంతీయ భాషల్లో ప్రచురించే జర్నల్ల సంఖ్య పెరగాలి, పరిశోధనా పత్రాలను సమర్పించే సమావేశాలలో ప్రాంతీయ భాషలలో సమర్చించే పత్రాలకు పెద్ద పీట వేయాలి.

అయితే ఐఐటీ లాంటి జాతీయ సంస్థల్లో ఒక్కో తరగతిలో దేశం నలుమూలల నుండి వచ్చిన ఎన్నో భాషలు మాతృభాషలుగా గల విద్యార్దులుంటారు. ఉపాధ్యాయుడు కూడా ప్రాంతీయ భాష తెలిసిన వాడై ఉండకపోవచ్చు. కానీ మారుతున్న సాంకేతికత వలన ఏ భాషలోనైనా బోధన జరుగుతుంది. ఈ పరిస్థితిని ఎంత సృజనాత్మకంగా అందరికీ ఉపయోగపడేలా మలుచుకోవచ్చోనన్న బాధ్యత ఉపాధ్యాయుడి పై ఉంది. జాతీయ అనువాద, అనుసృజన సంస్ద ఏర్పడ్డాక ఈ విషయమై మరింత స్పష్టత చేకూరుతుంది.

పై అభిప్రాయాలకు విపరీతంగా పలువురు ఉపాధ్యాయులు అభిప్రాయపడ్డారు. వారు ప్రాంతీయ భాషల్లో ఇంజనీరింగ్‌ విద్యకు వ్యతిరేకత తెలుపున్నందుకు ప్రధాన కారణం, సమయాభావం. అతి తక్కువ కాలంలో, అంటే ఈ రానున్న విద్యా సంవత్సరం నుండే బోధన ప్రాంతీయ భాషల్లో జరగాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వీరిలో సింహభాగం వ్యతిరేకిస్తున్నారు. తగినంత సమయం ఇస్తే, ప్రాంతీయ భాషల్లో బోధనాంశాలు రూపొందించవచ్చని, ప్రాంతీయ భాషల్లో చదివించే ఉపాధ్యాయులను సన్నద్దం చేసుకోవచ్చని వారి


నలభై శాతం తెలుగు ఇంజనీరింగ్‌ విద్యార్థులకు తెలుగులోనే ఇంజనీరింగ్‌ కావాలి!

అఖిల భారత సాంకేతిక విద్యా సంస్థ నిర్వహించిన సర్వేలో తెలిసిన ఆసక్తికరమైన విషయాలు.


ఈ ఏడాది ఫిబ్రవరిలో అఖిల భారత సాంకేతిక విద్యా సంస్థ (ఏఐసీటీఈ) ఒక సర్వేను నిర్వహించింది. ఈ సర్వేలో ఏఐసీటీఈ అనుబంధ ఇంజనీరింగ్‌ కళాశాలల విద్యార్థులందరూ పాల్గొనవచ్చు. వారం రోజులపాటు అందుబాటులో ఉన్న ఈ స్వచ్చంద సర్వేలో 83,195 మంది విద్యార్థులు పాల్గొన్నారు. మొత్తం పది ప్రశ్నలున్న ఈ సర్వేలో విద్యార్ధులు ప్రస్తుతం ఏ ఏడాది ఇంజనీరింగ్‌ చదువుతున్నారు. ఏ కళాశాలలో చదువుతున్నారు, పేరు, స్త్రీ/పురుషుడు, ఇంజనీరింగ్‌ బ్రాంచ్‌, మాతృభాష పదవ తరగతి వరకు చదువుకున్న మాధ్యమం, ఇంటర్‌ లో చదువుకున్న మాధ్యమం, బిటెక్‌ విద్య ఇంగ్లీష్‌ కాకుండా మాతృభాషా మాధ్యమంలో ఉండాలా ఒకవేళ మాతృభాషలో ఉంటే, ఏ భాషలో చదవాలనుకుంటున్నారు. అనే అంశాలున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌ నుంచి ప్రముఖ కళాశాలలన్నిటి పేర్లూ సర్వేలో కనిపించాయి, అంటే ఇక్కడి విద్యార్దులు బాగానే సర్వేలో పాల్టొన్నారు. నాలుగు ఏడాదుల వాళ్ళు సమపాళ్ళలో పాల్గొన్నారు. అత్యధికంగా కంప్వూటర్‌ సైన్స్‌ విద్యార్థులు 26% పాల్గొన్నారు. తమిళం మాతృభాష అని చెప్పుకుని 29,683 మంది విద్యార్దులు పాల్గొనగా, తెలుగు వారు 11,531 మంది విద్యార్థులు ఈ సర్వేలో పాల్గొన్నారు. 14,730 మంది హిందీ విద్యార్థులు ఈ సర్వే లో పాల్గొన్నారు. సంఖ్యాపరంగా మొత్తం సర్వే లో పాల్గొన్నవారిలో దాదాపు 14% తెలుగు విద్యార్థులున్నారు.

పదవ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం వారు మొత్తం సర్వేలో 79% ఉన్నారు. 15.2% మంది మాతృభాషా మాధ్యమంగా నమోదు చేసుకున్నారు. అయితే ఐచ్చికాలలో ఆంగ్లమా, మాతృభాషా? అని ప్రశ్న ఉన్నా జవాబులో హిందీ, తమిళం, తెలుగు, సెమి-ఇంగ్లీష్‌ ఇలా ఇతర ఐచ్చికాలు కూడా సర్వేలో పాల్గొన్న విద్యారులు చొప్పించారు. అలా ఒక 50-100 తెలుగు అని సూచించారు. (telugu. Telugu , Telugu medium ఇలా వేరు వేరుగా చొప్పించి)

ఇంటర్లో 81.7% మంది ఆంగ్ల మాధ్యమం అని ఎంచుకోగా, 12.6% మంది మాతృభాషా మాధ్యమమని ఎంచుకున్నారు. ఇక్కడ కూడా బలవంతంగా హిందీ, తమిళం, గుజరాతీ అని చొప్పించిన వారున్నారు.

తొమ్మిదవ ప్రశ్న - ప్రస్తుత ఇంజనీరింగ్‌ విద్య ఒకవేళ ఆంగ్లంతో పాటుగా మాతృభాషామాధ్యమంలో అందుబాటులో ఉంటే, ఆంగ్ల మాథ్యమమా? మాతృభాషా మాధ్యమమా? అని అడగగా, 56.2% మంది మాతృభాషా మాధ్యమమని, 43.8% మంది ఆంగ్లమాథ్యమం అని జవాబిచ్చారు.

ఇక ఆఖరు ప్రశ్న - మాతృభాషా మాధ్యమమైతే ఏ భాషలో ఉండాలి? అని.

దీనికి జవాబుగా అత్యధికంగా 14,129 మంది తమిళం అని జవాబిచ్చారు. తరువాతి స్థానంలో హిందీ 8,608 మంది విద్యార్థులు అడిగారు. ఆ తరువాత తెలుగు కావాలని 4,646 మంది విద్యార్థులు కోరారు. తరువాతి వరుసలో మరాఠీ, కన్నడ, మలయాళం, గుజరాతీ మొదలగు భాషల్లో ఉండాలని అభ్యర్థన అందింది.

ఈ సర్వేలో తికమక పెట్టే విషయం, మాతృభాష ఏది అని ఆరవ ప్రశ్నగా అడిగి, మళ్ళీ పదవ ప్రశ్నలో మాతృభాషా మాధ్యమ ఇంజనీరింగ్‌ విద్యలో ఏ భాషను ఎంచుకుంటారు అని అడగడం.

అంటే తమిళమో, తెలుగో మాతృభాష ఉన్నా హిందీ మాధ్యమంలో అడుగుతారని ఏఐసీటీఈ అభిమతం ఏమో?

మాతృభాషలోనే ఇంజనీరింగు కావాలని అడిగిన విద్యార్డులో, భాషలవారిగా : తమిళం-47.5%, హిందీ-58.43% తెలుగు- 40.18%. అంటే 10లో నలుగురు తెలుగు ఇంజనీరింగ్‌ విద్యార్థులకు తెలుగులోనే ఇంజనీరింగ్‌ కావాలి.

తెలుగు మాధ్యమం పాఠశాల స్థాయిలో వద్దు అన్న ప్రభుత్వాలకి ఈ గణాంకాలు కనువిప్పు చేస్తే బావుణ్ణు.

-రహ్మానుద్దీన్‌ షేక్‌

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఏప్రిల్‌-2021

1