పుట:ఏప్రిల్ 2021, అమ్మనుడి మాస పత్రిక.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సాంకేతికవిద్య

రహ్మానుద్దీన్‌ షేక్‌ 94930 35658

ప్రాంతీయ భాషల్లో సాంకేతిక విద్య అంశంపై రెండు నాల్కల ధోరణి

ప్రాంతీయ భాషల్లోనే మెరుగైన సాంకేతిక విద్య అందుతుంది అని ఒప్పుకుంటూనే, ప్రాంతీయ భాషల్లొ నైపుణ్యం ఉన్న ఆచార్యుల కోసం వెతికితే సాంకెతిక నైపుణ్యంతో రాజీ పడాలని అంటున్న ఐఐటీ డైరెక్టర్లు.

2020లో అమలు లోకి వచ్చిన జాతీయ విద్యా విధాన చట్టంలో ఆంగ్లం-హిందీ భాషల్లో, ఎనిమిది ప్రాంతీయ భాషల్లో సాంకేతిక విద్యా వనరులు రూపొందించడంతోపాటుగా ప్రాంతీయ భాషల్లో ఇంజనీరింగ్‌ విద్యను ప్రవేశపెడతామని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ పలు మార్లు మీడియా ముఖంగా తెలిపారు. నవంబరులో ఈ అంశమై ముందడుగు వేస్తూ దేశంలో సాంకేతిక విద్యకు పేరున్న వివిధ ఐఐటీల, ఎన్‌ఐటీల సంచాలకులతో పలు సమావేశాలు జరిపి మొదటగా ఎంపిక చేసిన కొన్ని ఐఐటీల్లో, ఎన్‌ఐటీల్లో హిందీలో మాధ్యమంలో ఇంజనీరింగ్‌ కోర్సుల బోధనను తదుపరి విద్యా సంవత్సరం నుండి ప్రవేశపెడతామని ప్రకటించారు. ఈ సమావేశాల పరంపర జరుగుతూండగానే, ప్రాంతీయ భాషల్లో ఇంజనీరింగ్‌ విద్యపై సానుకూలంగా కొందరు, ప్రతికూలంగా కొందరు విద్యావేత్తలు తమ అభిప్రాయాన్ని మీడియా ముఖంగా పంచుకున్నారు. గమ్మత్తైన విషయం ఏమిటంటే, విద్య మాతృభాషలో చదివితేనే మెరుగ్గా అబ్బుతుందన్న నిజాన్ని మాత్రం అందరూ ఒప్పుకొన్నారు.

జవాహర్లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఎం. జగదీశ్‌ కుమార్‌ మాట్లాడుతూ, “గత నాలుగైదు దశాబ్దాలుగా ఆంగ్ల మాధ్యమ బోధన అనేది ఒక వివాదాంశంగా ఉంది. ముఖ్యంగా గ్లొబల్‌ సౌత్‌ అని పిలవబడే అభివృద్ది చెందని అన్ని దేశాలలో మూకుమ్మడిగా వారి ప్రాంతీయ భాషలను పక్కన పెట్టి అంగ్లంలో చదువుకోవడం ఒక అభివృద్ది సూచకంగా చూడబడుతోంది. ఇజ్రాయెల్‌ మినహా మిగతా మధ్యధరా దేశాల్లో జపాన్‌, చైనా మినహా మిగతా ఆసియా దేశాల్లో, ఆఫ్రికా, మధ్య-దక్షిణ అమెరికా దేశాల్లో ఈ ఆంగ్ల మాథ్యమ మోజు పెరుగుతూ వస్తుంది. ఆంగ్ల మాధ్యమ విద్యా బోధనకు వ్యతిరేకంగా ఆయా దేశాల్లో ఉద్యమాలు నడుస్తున్నా అవి భావోద్వేగాల ఆధారంగానే తప్ప- వైజ్ఞానిక పరిశోధనల మీద ఆధారపడి లేవు. అయితే మాతృభాషా మాధ్యమ బోధన ద్వారా చదువుకున్న విద్యార్థుల్లో జ్ఞానం, గ్రహణశక్తి మెరుగ్గా ఉంటాయనేది ఎన్నో పరిశోధనల్లో బుజునైంది. ఉదాహరణకు హాంగ్‌కాంగ్‌ లో ఇటీవల జరిగిన ఒక అధ్యయనంలో మాతృభాషలో ఉత్తీర్ణులై వచ్చిన విద్యార్థులు భౌతిక శాస్త్రంలోని పై స్థాయి విషయాలను ఇట్టే అర్ధం చేసుకోగలిగారు, ఆంగ్లమాధ్యమంలో చదువుకున్న విద్యార్థులకన్నా మెరుగ్గా. దక్షిణాఫ్రికాలో జరిగిన మరో పరిశోధనలో మాతృభాషలో విజ్ఞానశాస్త్ర, ఇంజనీరింగ్‌ సంబంధిత అంశాలను చదువుకున్న విద్యార్థులు, ఆంగ్లమాధ్యమంలో చదువుకున్న విద్యార్జులకన్నా మెరుగ్గా తాము నేర్చుకున్న అంశాలను తిరిగి చెప్పగలిగారు, వారి ఆత్మవిశ్వాసం కూడా మెరుగ్గా ఉందని ఈ అధ్యయనంలో తెలిసింది. లెబనాన్‌ దేశంలో విద్యార్థులు తమకు మాతృభాషాలో విద్య కావాలని అడుగుతున్నారట. విద్యార్థులకు వారి మాతృభాషల్లో విద్య అందితే వారి సృజనాత్మకత, ఆత్మవిశ్వాసం, నెగ్గే నైజం బాగా మెరుగవుతున్నాయని ఈ రంగంలో జరిగే ప్రతి పరిశోధనలోనూ, అధ్యయనంలోనూ తెలుస్తోంది. ప్రాథమిక స్థాయి నుండి ఆపై ఇంజనీరింగ్‌ విద్యలో సైతం మాతృభాషా బొధనను ప్రవేశపెట్టాలన్న కొత్త విద్వా చట్టం, అందుకు తగ్గట్టు అడుగులు వేస్తున్న ప్రభుత్వ చర్యలు మెచ్చుకోదగ్గవి.” అని జాతీయ విద్వా చట్టాన్ని ఆయన సమర్ధించాడు. తన సుదీర్హ బోధనానుభవంలో ఐఐటీలో ఆంగ్లంలో మాత్రమే కాకుండా, ఆంగ్లం-హిందీ కలిపి మిశ్రమ భాషలో బోధించినపుడు విద్యార్థులు తాను చెప్పిన పాఠాలను మరింత మెరుగ్గా ఆకళింపు చేసుకున్నారని, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు తరగతి గదిలో మరింత ఆసక్తిగా నడుచుకున్నారని, తన స్వీయానుభవం పంచుకున్నాడు. ఐఐటీల్లో మొదటి సంవత్సరాంత పరీక్షల్లో మౌలిక సబ్జెక్టులైన ఫిజిక్స్‌, గణితంలో గ్రామీణ ప్రాంతాల విద్వార్థులు ఉత్తీర్ణులు కాలేక పోవడానికి ఆంగ్ల మాధ్యమం ఒక అడ్డుగోడగా ఉంటోందని, ఆ గోడని దాటే అదనపు చాకిరీ విద్యార్థులు భరించాల్సి వస్తుందని ఆయన అన్నాడు. ప్రాంతీయ భాషల్లో, లేదా కనీసం ఆంగ్లం కలిపిన మిశ్రమ భాషలో బోధనా, పరీక్షలు చేపట్టి ఈ అడ్డంకిని సమర్ధంగా దాటవచ్చని ఆయన అభిప్రాయ పడ్డాడు.

ఐఐటి హైదరాబాదు ఆచార్యులు శివ్‌ గోవింద్‌ సింగ్‌ తమ అభిప్రాయాన్ని చెబుతూ, మాతృభాషలో భొధనాంశాలు విద్యార్థి తిరిగి చెప్పగలిగినపుడే అతను విషయ పరిజ్ఞానాన్ని మెరుగ్గా కలిగి ఉండే అవకాశాలున్నాయని, తన స్వీయ అనుభవంలో తెలుసుకున్న విషయమిది అని ఆయన చెప్పాడు.

ఐఐటీ బెనారస్‌ హిందూ యూనివర్సిటీ సంచాలకుడు ప్రమోద్‌ కుమార్‌ జైన్‌ మాట్లాడుతూ విద్యార్థులకు మౌలిక అంశాల్లో విషయ పరిజ్ఞానం సమకూర్చాల్సిన బాధ్యత బోధకులదే అని చెప్పాడు. ప్రస్తుతం ఐబటీలలో, ఎన్‌ఐటీలలో ఉపాధ్యాయులు మిశ్రమ భాషలో బోధిస్తున్నారని, అయితే పరీక్షా విధానం కూడా ప్రాంతీయ భాషల్లో ఉంటే విద్యార్థులకు మరింత చేరువగా సాంకేతిక విద్య ఉంటుందని అభిప్రాయపడ్డాడు.

మరి బయట ప్రపంచంలో అన్ని ఉద్యోగాలలో అంగ్ల భాష అవసరం ఉంటోంది, ఇలాంటి పరిస్థితుల్లో ప్రాంతీయ భాషల్లో చదువుకున్న సాంకేతిక విద్యార్థులు ఎలా పోటీని తట్టుకోగలరు? అన్న సంశయానికి అచార్య జగదీశ్‌ కుమార్‌ సమాధానమిస్తూ, అంగ్లం కేవలం సంభాషణలకు కావాల్సిన ఒక ఉపకరణమే గానీ, పనికి కావాల్సిన నైపుణ్యత ప్రాంతీయ భాషలో నేర్చుకున్నా

తెలుగుజాతి పత్రిక అమ్మనుడి * ఏప్రిల్‌-2021

9