పుట:ఉషాపరిణయము (పసపులేటి రంగాజమ్మ).pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

vi

ఉషస్సుషమ

వారి సొమ్ములు : చౌకట్లు, కంటసరులు, చేసరులు, తాళి, వంకి, బిరుదుపెండెము మొ॥

2. ఉష బాల్యక్రీడలు :

గుజ్జనగూళ్లు, బొమ్మలపెండ్లి, దాగిలిమ్రుచ్చులు, చెండుగోరింతము, గుజగుజఱేకులు, పగడసాల, చదరంగము. ఇవియు నాఁటి పిల్లకాయల ఆటలే)

3. ద్వితీయాశ్వాసమున నుషాసఖుల సంగీతమేళ సందర్భమునఁ బేర్కొనఁబడిన వాద్యవిశేషములు :

దండె, తంబుర, స్వరమండలము, రబాబు, వ్రేటుగజ్జెలు,ముఖవీణ, ఢక్క, చెంగు, కామాచి, ఉపాంగము, కిన్నెరవీణ, తాళము, పిల్లఁగ్రోవి, చిటితాళము, రమ, శేషనాదము, రావణహస్తము, చంద్రవలయములు, మురజము.

4. తృతీయాశ్వాసమున - వైతాళీయ గీతములు :

దేవగాంధారి, దేశాక్షి. మలహరి, గుండక్రియ, లలితగుజ్జరి మొదలగు నుదయరాగములలో సాగినవఁట. ఆ వాద్య రాగముల ప్రసక్తిలో నాయకరాజుల కొలువు భోగాల వారి సంగీతసాధనయే స్ఫురించుచున్నది.

5. ఆ మేలుకొలుపులకు లేచిన రాచవారు చూచుకొను శుభశకునములు :

అద్దము, క్షీరకలశములు, అలరుసరులు, కపిలగోవు, విప్రయుగము.

ఆ దర్పణావలోకనాదికము నాయకరాజులకుఁ గర్లాటప్రభువులనుండి సంక్రమించిన సంప్రదాయము[1].

6. గ్రంథమధ్యముసఁ బ్రసక్తు లైన నాఁటి రాజకీయోద్యోగులు :

అన్న గారులు, హెగ్గడికత్తెలు, అవసరాలవారు, గురిదొరలు.

7. 'తుంటవిల్ రాయల దాడి' నాయకరాజుల దండయాత్రల కొక సూచన :

8. చతుర్థాశ్వాసమున గరుడాళ్వారు ప్రశంస మూఁడు

  1. చూ. రాయవాచకము (ఆం. సా. ప. పచురణ)-2వ పుట