పుట:ఉషాపరిణయము (పసపులేటి రంగాజమ్మ).pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

iv

భూమిక

టి. ఎస్. వెంకట రామయ్యరు. ప్రథములు ప్రారంభము నుండి 99 పుటలు వఱకు వ్రాసిరి. శేషమును ద్వితీయులు పూర్తిచేసిరి. సుబ్రహ్మణ్యంగారి లేఖనవైఖరి చాలఁ జక్కనిది. మన్నారుదాసవిలాస నాటకమును గూడ నాంధ్రసాహిత్యపరిషత్తునకు వ్రాసి యిచ్చినది వీరే. ఈ రెండు వ్రాత ప్రతుల ముఖపత్రమున నిట్లు వ్రాసియున్నది.

'నళనామసంవత్సర చైత్రశుద్ధ ౧ (ప్రతిపద్) భానువాసరం మధ్యస్థనేనాధురంధర రాజశ్రీ రామయ్య వరాహప్పయ్య దీక్షితులవారి ఆజ్ఞా ప్రకారం, పద్యకావ్యం'

తర్వాతఁ బ్రతి స్థితి వివరణ లివ్వఁబడినవి. ఆంధ్రనాయకరాజ్య మంతరించిన పిమ్మట, మహారాష్ట్ర పరిపాలనములో శరఫోజీ ఫౌజుదారైన రామయ్య వరాహప్పయ్య దీక్షితులచేఁ గొన్ని తాళపత్త్ర గ్రంథములు సంపాదింపఁబడినట్లు శ్రీ జయంతి రామయ్యపంతులుగారు 'ఆంధ్రచరిత్ర పరిశోధనమండలి' పత్త్రికలో (సంపుటి 2 పుట 174) బ్రకటించిరి. ఈయన వేఁగినాఁటి బ్రాహ్మణుఁ డఁట. ఆయనయే యీయన యేమో.

ఇప్పు డీ యుషాపరిణయ ప్రబంధమును బ్రచురించి సహృదయుల కందఁజేయుచున్న పరిషత్కార్యదర్శులు బ్రహ్మశ్రీ చతుర్వేదుల సత్యనారాయణశాస్త్రిగారికి శ్రీమాన్ ప్రతివాద భయంకర పార్థసారధిగారికి, నితర సహృదయపారిషదులకుఁ, బీఠిక వ్రాసియిచ్చిన శ్రీ యస్వీ జోగారావు గారికి నా యభినందనములు.

ఆంధ్రసాహిత్యపరిషత్తు -

కాకినాడ

1 - నవంబరు, 1953

వద్దిపర్తి చలపతిరావు.

మేనేజరు.