పుట:ఉషాపరిణయము (పసపులేటి రంగాజమ్మ).pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

భూమిక

III

చెంజిలక్ష్మి కలలోఁ గన్పడి యా నాఁడు దేవకి కడుపునఁ బుట్టి యశోద యొడిలోఁ బెరిగితిని. ఈనాఁడు కళావతమ్మ కడుపునఁ బుట్టి నీ యొడిలోఁ బెరిగెదను; స్వీకరింపుము' అని మాయమైనాఁ డఁట. ఆ కృష్ణుఁడే విజయ రాఘవుఁ డఁట.

విజయరాఘవుఁడు బహు గ్రంథకర్త. బహు కృతి భర్త. సంగీత సాహిత్య రసబ్రహ్మ.

దక్షిణాంధ్రయుగము తెల్గుభాషకు నొక యపూర్వ ఘట్టము. ప్రబంధములు గాక పదములు, యక్షగానములు, వచనములు నను విశిష్టతలతో నీ నాఁటి తెల్గుసాహితి త్రిస్రోతస్సుగాఁ బ్రవహించినది. త ద్రసగంగాధరుఁడు విజయరాఘవుడు.

తొలిదొల్త దక్షిణాంధ్రసాహిత్యమును గుఱించి యాంధ్రలోకమునకుఁ దెలియఁజేసిన దాంధ్రసాహిత్యపరిషత్తే. ఈ యశస్సు శ్రీ జయంతి రామయ్యపంతులుగారిది. కాలక్రమమున నాంధ్రసాహిత్యపరిషత్తు మధురాతంజావూరాంధ్రకవుల రచనలు - వచన జైమినీభారతము, మన్నారుదాసవిలాస నాటకము, కవిజనోజ్జీవని, రఘునాథరామాయణము నిటీవల రాధికాసాంత్వనమును బ్రచురణ చేసినది

ఈ గ్రంథముద్రణకు నాంధ్రసాహిత్యపరిషత్తున నొక వ్రాతప్రతి మాత్ర మున్నది. ఇది తంజావూరి సరస్వతీమహలు నందలి 283 సంఖ్యగల తాళపత్త్రమునుండి వ్రాయఁబడినది. ఈ తాళపత్త్రమున 110 పుట లున్నవి. తప్పులు లేవు. వ్రాత మంచిది. శైథిల్యము హెచ్చు. గ్రంథాంతమునఁ గొన్ని పత్రము లత్యంత జీర్ణములు. మూఁ డాశ్వాసములు మాత్రము సమగ్రముగ నున్నవి. నాల్గవ యాశ్వాసము గొంతవఱ కున్నది. గ్రంథపాత మున్నది. పరిషత్తున నున్న ప్రతి దీనికి యథాతథమే. దీని లేఖకు లిద్దరు. శ్రీ పి. బాలసుబ్రహ్మణ్యం,