పుట:ఉషాపరిణయము (పసపులేటి రంగాజమ్మ).pdf/166

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

126

ఉషాపరిణయము


వ.

మఱియును.


చ.

ప్రళయహుతాశనప్రకరభాసురుఁడై యెదిరించు వీరులన్
హలమున నీడ్చియీడ్చి ముసలాగ్రమునన్ బడఁ గ్రుమ్మి చిమ్ముచున్
బలుమరు నిట్లు రౌద్రనిజభావముఁ జూపుచునుండఁ గోట్లు కొం
[1]డలుగఁ బడందొణంగి రచటన్ బ్రమథప్రబలారిసైనికుల్.

49


క.

ప్రద్యుమ్నుం డరితిమిర
ప్రద్యోతనుఁ డగుచు నిశితబాణవితతిచే
విద్యున్నిభదంష్ట్రుల సమ
రోద్యుక్తులఁ ద్రుంచె దనుజయూథాధిపులన్.

50


గీ.

శంఖచక్రగదాఖ్యశార్ఙ్గధారి
కంసవైరియు నిజకరకౌశలంబు
మెఱయ రయమున శరములు నెరయఁజేసి
రక్కసుల భూరిదర్పంబు నుక్కడంచె.

51


క.

పక్షికులాద్యక్షుఁడు సం
ధుక్షితనిజపక్షతీక్ష్ణతుండాగ్రములన్
రక్షోనివహంబుల ముఖ
వక్షంబుల నడఁచి వ్రచ్చి వందఱలాడెన్.

52


క.

ఈపగిది నలుగురు భుజా
టోపంబులుఁ జూపు నప్పుడు సురారిభటుల్
చాపంబులు దిగవిడిచి
కాపికలై చనిరి (మి)గులఁ గలఁగంబడుచున్.

53
  1. డలుగఁబడందొణంగి రచటన్ ప్రమథప్రముఖప్రబలారిసైనికుల్