పుట:ఉషాపరిణయము (పసపులేటి రంగాజమ్మ).pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

125


ర్వారత గెల్చెద విహగరాజును నియ్యెడ డిగ్గి నావుడున్
శౌరియు నట్లకాక కదనంబును సేయుద మంద ఱొక్కటన్.

46


యుద్ధముఁ జేయ బలభద్రాదుల వేర్వేరుచోట్ల శ్రీకృష్ణుడు నియోగించుట

వ.

అని పల్కి సుపర్ణుని డిగ్గె నప్పుడు బలభద్రప్రద్యుమ్నులును
తోడన డిగ్గి నప్పు డప్పంకజాక్షుండు పన్నగాశనప్రద్యుమ్నబల
దేవులఁ బేర్వేరం బేర్కొని యిట్లనియె.


సీ.

పన్నగాశన! నీవు వెన్నాసగా నిల్చి
        యటవచ్చు నహితుల నడఁచవలయు
రేవతీప్రియ! నీవు నావలపలిదిక్కు
        నను నిల్చి రిపులతోఁ బెనఁగవలయుఁ
బ్రద్యుమ్న! నీవు డాపలిదెసకై నిల్చి
        యరిసంఘములనెల్ల నుఱుమవలయు
బలములఁ జెదిరి విచ్చలవిడి వడి నేను
        దోశ్శక్తిఁ దునిమెదఁ దునుమవలయు


గీ.

నసురనివహమునెల్ల నటంచుఁబలుకు
నంతలోననె తద్బలమంత నింతఁ
గదియవచ్చిన శౌరియుఁ గదిమె నంత
గురుతరంబుగ నల పోరు ఘోరమయ్యె.

47


ఘోరయుద్ధమున శంభుసై న్యము పరాజయమునొందుట

క.

హలధరుఁడు నుగ్రుఁడై లాం
[1]గలమున దానవగణంబు గదియుచుఁ బెనుఁగు
ప్పులుఁగాఁ బడఁజేయుచుఁ దన
బలస్ఫురణ రణమునందుఁ బ్రబలఁగఁజేసెన్.

48
  1. గలమున దానవగణంబు గదిశికు