పుట:ఉషాపరిణయము (పసపులేటి రంగాజమ్మ).pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

79


మోము మోమునఁ జేర్చి ముద్దుపెట్టఁగ రాగ
        మురిపెంపు సిగ్గుతో మోముఁ ద్రిప్పుఁ
బ్రేమంబుమీరఁగ బిగువుగౌఁగిటఁ జేర్ప
        లజ్జచేఁ బతికేలు లలినిఁ ద్రోయుఁ


గీ.

బోఁకముడి వదలింపఁగఁ బొంకముగను
ముడి సడల్పంగనీయక ముదిత పెనఁగుఁ
గాముకేళికిఁ దమితోడఁ గలయరాఁగ
గోల నలుదిక్కులను జూచుఁ గొంకుమిగుల.

34


వ.

అయ్యవసరంబున.


సీ.

ముచ్చటదీరఁగ ముద్దుబెట్టవె చేరి
        మోమేల త్రిప్పెద ముద్దుగుమ్మ!
వీనుల నమృతంబు వెదచల్లునట్లుగా
        మాటలాడ వదేమి మచ్చకంటి!
మరుకాఁక దీరంగ మమతలు హెచ్చంగఁ
        [1]గౌఁగిలింపవె నన్ను కలువకంటి!
యక్కునఁ గదియించి యాదరింపుచుఁ బ్రేమఁ
        బుక్కిటివిడె మీవె పువ్వుఁబోణి!


గీ.

భామ! మ్రొక్కెద నే నీదు పదములకును
మనవు లాలించి యేలవే మందగమన!
చాలదయఁ జూడవే నన్ను సన్నుతాంగి!
రతుల నన్నేలవే లీల రాజవదన!

35
  1. కౌఁగిలింపఁగ