పుట:ఉషాపరిణయము (పసపులేటి రంగాజమ్మ).pdf/118

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

78

ఉషాపరిణయము


గీ.

నిచ్చటికి నీవు నను దోడితెచ్చినట్లు
వేడుకను నన్ను నీయుష గూడినట్లు
మేలుగలయట్టి కలఁ గని మేలుకనుచు
నిజముగా మిమ్ముఁ జూచితి నీరజాక్షి!

30


వ.

అనిన ననిరుద్ధునిఁ జూచి చిత్రరేఖ యిట్లనియె.


క.

రమణుల నెందఱినైనను
రమణీయత నేలుకొన్న రసికుఁడవుగదా!
తమితోడుత మాచెలి నిపు
డమరఁగ రతి నేలుకోర యతనుకుమారా!

31


క.

అని యొకపనినెపమున న
[1]య్యనుఁగుచెలియ చెలులతోడ నావలికేగన్
వినమితముఖియౌ నుషఁ గని
యనిరుద్ధుం డపుడు మందహాసముమీరన్.

32


అనిరుద్ధుఁ డుషను గాంధర్వమున వివాహమాడుట
సంభోగశృంగారము

క.

మనకోరిక లీడేరెను
వనితామణి! రమ్మటంచు వాంఛలు మీరన్
దనరెడు గాంధర్వంబునఁ
దనకరమున నింతికరముఁ దడయక పట్టెన్.

33


సీ.

చేరంగ రమ్మని చేపట్టి తీసినఁ
        జిరునవ్వు నవ్వుచుఁ జే విదల్చుఁ
బయ్యదఁ దొలఁగించి బటువుగుబ్బలఁ [2]బట్ట
        మాటికిఁ జనుదోయి మఱుఁగుసేయు

  1. య్యనుఁగుజెలి చెలులతోడ నావలికి నేఁగన్
  2. పట్టి