పుట:ఉభయసభలనుద్దేశించి ఆంధ్రప్రదేశ్ గవర్నరు ప్రసంగము 2019-06-14.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కోసం సంపదను సృష్టించాల్సిన ఆవశ్యకత ఉంది. సరైన దిశలో శిక్షణ పొందిన యువత మంచి ఉద్యోగ అవకాశాలను పొందుతారు. ఈ దీర్ఘకాలిక ప్రణాళికతో యువత సామర్థ్యాలను మరింత ఉత్పాదక విధానంలో వినియోగించాలని నా ప్రభుత్వం యోచిస్తున్నది. విద్యా విధానంలో ప్రమాణాలను మెరుగుపరచి, ఐటిఐలు మరియు పాలిటెక్నిక్లలో గణనీయమైన అభివృద్ధిని సాధించేందుకు రాష్ట్రం కట్టుబడి ఉంది. సాంకేతిక విద్యా సంబంధ సంస్థలతో పరిశ్రమ అనుసంధానాన్ని నిర్ధారిస్తూ యువతను పరిశ్రమకు సంసిద్ధంగా ఉంచడమవుతుంది. దీనితో, తయారీ రంగంలో యువత కోసం ఉద్యోగాలను కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు ప్రారంభిస్తుంది.

సరైన స్పూర్తితో నవరత్నాలను అమలు పరచడమే కాకుండా, నా ప్రభుత్వం పరిశ్రమ మరియు సేవా రంగాలను అభివృద్ధిపరచడంపై కూడా దృష్టిసారిస్తుంది. సముచిత ప్రమేయాలలో ప్రత్యేకంగా మహిళల భద్రత మరియు రక్షణ కోసం సాంకేతికతను అవలంబించడమవుతుంది. గ్రామీణ మరియు పట్టణ మౌలిక సదుపాయాలు సంపూర్ణంగా అందే విధంగా ప్రణాళికాబద్ధ విధానంలో చేపట్టడమవుతుంది. పట్టణ ప్రాంతాలలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడం కోసం ప్రత్యామ్నాయ ట్రాఫిక్ నమూనాలను అధ్యయనం చేయడమవుతుంది. సంప్రదాయేతర ఇంధనాన్ని ప్రోత్సహిస్తూ, సంప్రదాయ విద్యుత్తు విధానంలో టిడిడి నష్టాలను తగ్గించేందుకు ప్రాధాన్యత ఇవ్వడమవుతుంది.

ప్రజలకు చేసిన వాగ్దానాలను నెరవేర్చే దిశగా, గత పది రోజులలో నా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రభుత్వం యొక్క నిజాయితీ, నిబద్ధతకు ప్రతీక అని తెలియజేయుటకు నేను సంతోషిస్తున్నాను. ఈ దిశగా ప్రత్యేకించి ఈ క్రింది నిర్ణయాలను పేర్కొనవలసిన అవసరమున్నది.

• పింఛను మొత్తాన్ని రూ. 2250/- లకు పెంచడం.

• ఆశా వర్కర్ల జీతాలను రూ.3000/- నుండి రూ. 10,000/-లకు పెంచడం.

13