పుట:ఉభయసభలనుద్దేశించి ఆంధ్రప్రదేశ్ గవర్నరు ప్రసంగము 2019-06-14.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నియామకాలన్నింటిలో 50 శాతం రిజర్వేషన్ కల్పించాలని నా ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నది. నాయీ బ్రాహ్మణులు, దర్జీలు, మత్స్యకారులు, నేతకారులకు ఆర్ధిక మద్దతును అందించడమవుతుంది.

కాపు వర్గం సంక్షేమానికి నా ప్రభుత్వం అంతే సమానంగా కట్టుబడి ఉంది. కాపుల కోసం ఐదు సంవత్సరాల కాలంలో రూ.10,000 కోట్లను ప్రత్యేకించడానికి ప్రణాళికలను కలిగివున్నాం. ఆర్యవైశ్యులు, ముస్లిం మైనారిటీలు, క్రిస్టియన్ మైనారిటీలు మరియు అగ్ర వర్ణాలలోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాల పట్ల తగినంత శ్రద్ధను చూపడమవుతుంది. జర్నలిస్టులు, లాయర్లు, ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి కూడా నా ప్రభుత్వం కట్టుబడి ఉంది. అధికారుల అవినీతి లేదా ఉదాసీనతను సహించకుండా ఉంటూ, యోగ్యమైన పరిశీలనలు మరియు గుర్తింపుపొందిన సూచనలను స్వీకరించడానికి నా ప్రభుత్వం సిద్దంగా ఉంది.

పదవీ స్వీకారం తరువాత, సామాజిక సంక్షేమ పింఛనును దశలవారీగా రూ.3000/- లకు పెంచుతామనే వాగ్దానాన్ని నెరవేరుస్తూ, నా ప్రభుత్వం మొదటి చర్యగా, వృద్దులకు వైఎస్ఆర్ భరోసా పింఛనును రూ.2250/-లకు పెంచింది మరియు సంవత్సరానికి రూ.250/-ల పెరుగుదలతో రానున్న 4 సంవత్సరాలలో మొత్తం పింఛను రూ.3000/-లకు చేరుకుంటుంది. పింఛను కోసం అర్హమయ్యే వ్యక్తి వయస్సును 65 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలకు తగ్గించాం. ఇది సుమారుగా మరో 5 లక్షల మందికి లబ్దిని చేకూరుస్తుంది.

కులం, జాతి, మతం మరియు రాజకీయ గుర్తింపులకు అతీతంగా రాష్ట్రంలోని అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఒక గృహాన్ని సమకూర్చడానికి నా ప్రభుత్వం కట్టుబడి ఉంది. రానున్న 5 సంవత్సరాలలో 25 లక్షల గృహాలను నిర్మించడానికి మేము నిబద్దత కలిగి ఉన్నాం .

11