పుట:ఉభయసభలనుద్దేశించి ఆంధ్రప్రదేశ్ గవర్నరు ప్రసంగము 2019-06-14.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రూపొందిస్తుంది. ఈ ప్రయత్నాలన్నీ పేదలకు వారి స్వంత ఖర్చులను తగ్గించడమే కాకుండా, శిశు మరణాల రేటు, మాతృసంబంధ మరణాల దామాషా, మహిళలలో రక్తహీనత, పోషకాహార లోపం వంటి వివిధ ఆరోగ్య ప్రమాణాలలో గణనీయమైన మార్పులను తీసుకువస్తాయి. రాష్ట్రంలోని శిశువులు, విద్యార్ధులు, గర్భిణీలు మరియు పాలిచ్చే మహిళల ఆరోగ్యాన్ని సంరక్షించేందుకు మధ్యాహ్న భోజనాలు వంటి పోషకాహార సంబంధిత పథకాలను సరైన స్పూర్తితో అమలుపరచడమవుతుంది. గ్రామ ఆరోగ్య కార్యకర్తలను ప్రోత్సహించడానికి రాష్ట్రంలోని దాదాపు 45,000 మంది ఆశా వర్కర్లకు నెలవారీ గౌరవ వేతనాన్ని రూ.3000/-ల నుండి రూ.10,000/- లకు పెంచడమయింది.

మద్యపాన వినియోగం అనేది దురవస్థకు దారితీసి, భారీస్థాయిలో కుటుంబాలను విచ్చిన్నం చేస్తుంది. ఈ బెడద యొక్క ప్రతికూల ప్రభావాన్ని గుర్తిస్తూ, దశలవారీగా మద్యాన్ని నిషేధించడానికి నా ప్రభుత్వం కట్టుబడి ఉంది. మొదటి చర్యగా, గొలుసు దుకాణాల మూసివేతకు నా ప్రభుత్వం ఆదేశించింది. దీనివల్ల ఇది అనేకమంది హృదయాలలో సంతోషాన్ని తీసుకువస్తుందని ఆశించడమయింది.

నా ప్రభుత్వం, పాఠశాలకు వెళ్లే పిల్లలందరికీ విద్యను అందించేలా చూడటానికి కట్టుబడి ఉంది. తద్వారా, తన పిల్లల చదువు గురించి ఏ తల్లీ చింతించదు. గుర్తింపు మరియు ప్రోత్సాహక మొత్తంగా అమ్మ ఒడి పథకం క్రింద తన పిల్లలను పాఠశాలకు పంపుతున్నందుకు ప్రతి తల్లికి సంవత్సరానికి రూ.15000/- లను ఇచ్చేందుకు నా ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ చర్య పూర్తిగా బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడమే కాకుండా సార్వత్రిక విద్య ద్వారా విజ్ఞాన ఆర్థిక వ్యవస్థకు అవసరమైన పర్యావరణ వ్యవస్థను సృష్టిస్తుంది. ప్రాథమిక, ప్రాథమికోన్నత మరియు సెకండరీ స్థాయిలలో స్థూల నమోదు నిష్పత్తి (జిఇఆర్) లో మెరుగుదలను తీసుకురావడానికి మరియు ఈ స్థాయిలన్నింటిలో డ్రాపౌట్ రేట్లను గణనీయంగా తగ్గించడానికి కట్టుబడి ఉన్నాం. ప్రభుత్వ పాఠశాలల ప్రస్తుత స్థితి పిల్లలు పాఠశాలలకు వెళ్లేలా ప్రోత్సహించడానికి

9