పుట:ఉభయసభలనుద్దేశించి ఆంధ్రప్రదేశ్ గవర్నరు ప్రసంగము 2019-06-14.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సమయానికి ప్రతి రైతు కుటుంబానికి వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా సాలుకు రూ.12,500/-లను నా ప్రభుత్వం అందిస్తుంది. ఇది రైతులకు నేరుగా రూ.10000 కోట్లకు పైబడి నిధుల మొత్తం అందడానికి వీలుకల్పిస్తుంది. ఈ మొత్తంలో దాదాపు 5వ వంతు ఆర్ధిక సహాయం, ఓదార్పు కోసం చూస్తున్న భూయజమానులతోపాటు కౌలు రైతులకు అందుతుంది. సాగుదారులు మరియు భూయజమానుల ప్రయోజనాలు మరియు హక్కులకు భంగం కలగకుండా కౌలు రైతుల ప్రయోజనాలను కాపాడాలని నా ప్రభుత్వం నిశ్చయించింది.

నా ప్రభుత్వం రైతులకు వడ్డీ రహిత రుణాలను మరియు ఉచిత బోరు బావులను కూడా సమకూర్చాలని ప్రతిపాదిస్తున్నది. రైతులు బోరు బావులను ఉచితంగా సమకూర్చుకోవడానికి వీలుగా రాష్ట్రంలోని ప్రతి ఒక్క శాసనసభ నియోజకవర్గంలో ఒక రిగ్‌ను ఏర్పాటు చేయడానికి ప్రణాళికను రూపొందించడమయింది. ప్రత్యేకంగా శ్రద్ద ఉంచాలని ప్రతిపాదించిన కొన్ని ఇతర రైతు - హిత పూర్వక కార్యక్రమాలలో పగలు 9 గంటల ఉచిత విద్యుత్తును అందించడం, ఆక్వా రైతులకు మద్దతు, రూ.3000 కోట్ల కార్పస్‌తో ధరల స్థిరీకరణ నిధిని, రూ.2000 కోట్ల కార్పస్‌తో ప్రకృతి విపత్తు సహాయ నిధిని నెలకొల్పడం మరియు ప్రతి శాసనసభ నియోజకవర్గంలో ఒక ఆహార ప్రాసెసింగ్ యూనిటును ఏర్పాటు చేయడం వంటివి చేరివున్నాయి. సహకార డైరీలకు పాలు సరఫరా చేసే రైతులకు లీటరుకు రూ.4/-ల ప్రోత్సాహకాన్ని ఇవ్వడం ద్వారా సహకార రంగాన్ని, ప్రత్యేకించి పాడి పరిశ్రమ రంగాన్ని పునరుద్దరించడానికి నా ప్రభుత్వం కట్టుబడి ఉంది. దురవస్థలో ఉన్న రైతు కుటుంబానికి అండగా నిలబడేందుకు ఏదేని కారణంచేత రైతు మరణించిన సందర్భంలో వైఎస్ఆర్ బీమా పథకం క్రింద రూ.7.00 లక్షల మొత్తాన్ని సమకూర్చడానికి నా ప్రభుత్వం కట్టుబడి ఉంది.

ఉపరితల మరియు భూగర్భ జలాల సమన్వయ వినియోగం, శాస్త్రీయ నీటి పరిరక్షణ ద్వారా నీటి వనరుల అభివృద్ధి, బిందు మరియు తుంపర సాగునీరు వంటి సూక్ష్మ సాగునీటి పద్ధతులను అనుసరించడం, నదుల అనుసంధానం మరియు నిర్ణీత

7