పుట:ఉభయసభలనుద్దేశించి ఆంధ్రప్రదేశ్ గవర్నరు ప్రసంగము 2019-06-14.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నా ప్రభుత్వం సహించదు. ఏదైనా సమస్యను వారు ఎదుర్కొన్నట్లయితే, ఈ సేవకులపై ప్రజలు కాల్ సెంటరులో ఫిర్యాదులను నమోదు చేయవచ్చు. నూటికి నూరు శాతం పారదర్శకత మరియు సంతృప్తి ఉండేలా చూడటానికి ఈ ప్రక్రియను సిఎంఓ నేరుగా పర్యవేక్షిస్తుంది. గ్రామ సచివాలయం ప్రజలకు పాలనను అందుబాటులోకి తీసుకొస్తుంది. పౌరుడి అభ్యర్ధనను 72 గంటలలో పరిష్కరిస్తుంది. ఇది 10 మంది విద్యావంతులైన యువతకు ఉపాధిని కల్పిస్తుంది.

ఎన్నికల ప్రణాళికను బహిరంగంగా ప్రదర్శించడం ద్వారా మరియు దానిని ఒక పవిత్ర పత్రంగా పరిగణించి, నా ప్రభుత్వం తనకు తాను బాధ్యత వహిస్తుంది. ఎటువంటి మార్పు లేకుండా దాని అమలుకు కట్టుబడి ఉంటుంది. ప్రతి ప్రభుత్వ శాఖ అన్ని వాగ్ధానాలను నెరవేర్చామని నిర్ధారించుకోవడానికి ఒక ప్రతిని ఉంచుకుంటుంది.

పేదలు, నిరుపేదలు, అభాగ్యులకు సహాయపడే మార్గాలను అన్వేషిస్తూ తప్పనిసరిగా కేంద్రీకృత పరిపాలన అంతటా దృష్టిసారించాలనేది మునుపటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి గారి భావజాలం ప్రస్తుత సందర్భంలో ప్రతి ఒక్కరు గ్రహిస్తారు. ఇది బహుశా ఏ సమయంలో ఉన్నదానికంటే ఇప్పుడు సంగతంగా ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత ప్రభుత్వం తొమ్మిది ఇతివృత్తాలతో కూడివున్న “నవరత్నాలు' అనే ఒక ఏకీకృత సంక్షేమ అజెండాను రూపొందిస్తున్నది. వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, అమ్మ ఒడి, ఫీజు రీయింబర్స్మెంటు, వైఎస్ఆర్ పింఛన్లు, పేదలందరికీ గృహాలు, యువతకు ఉపాధి మరియు ఉద్యోగ కల్పన, వైఎస్ఆర్ ఆసరా - వైఎస్ఆర్ చేయూత దశల వారీగా మద్యనిషేధం, జలయజ్ఞం వంటివి ఇతివృత్తాలుగా ఉన్నాయి. ఇతివృత్తాలను శ్రేణీకరించి పటిష్టవంతమైన పురోగతితో కూడిన సమర్ధవంతమైన అమలు రాబోయే సంవత్సరాల్లో నా ప్రభుత్వానికి ప్రధాన అజెండాగా ఉంటుంది. తొమ్మిది సంక్షేమ ఇతివృత్తాలను కలిగివున్న ఈ పథకం జనాభాలోని భిన్న వర్గాలకు

5