పుట:ఉభయసభలనుద్దేశించి ఆంధ్రప్రదేశ్ గవర్నరు ప్రసంగము 2019-06-14.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆదాయ ఆర్జన, ఉపాధి అవకాశాలు కోల్పోవడం, ప్రధాన ఆరోగ్య మరియు విద్యా సంస్థలను మరియు సామాజిక మౌలిక సదుపాయాలను కోల్పోవడం కారణంగా జరిగిన నష్టాన్ని పూర్తిగా పూరించాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రాష్ట్ర ప్రజలకు చేసిన అన్ని వాగ్దానాలను నెరవేర్చడానికి నా ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది. ఆ ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించడం ప్రోత్సాహకరంగా ఉంది. మార్పు కోసం - మెరుగైన మార్పు కోసం నిరాశ, నిస్పృహలతో ఎదురుచూస్తున్న ప్రజలలో ఆనందం మరియు సంతోష భావాన్ని కలిగించడం సముచితంగా ఉంటుంది.

నా ప్రభుత్వం సమస్యలను పరిష్కరించడానికి మరియు చేసిన వాగ్దానాలను నెరవేర్చడానికి స్పష్టమైన దృక్పథాన్ని మరియు చర్య తీసుకోదగిన ప్రణాళికలను కలిగి ఉంది. ఈ ప్రభుత్వం వ్యవస్థను పూర్తిగా ఆధునీకరించి దేశానికి ఆదర్శంగా నిలిచేందుకు కృషిచేస్తుంది. నా ప్రభుత్వం ఈ ప్రక్రియలో ద్విముఖ విధానాన్ని అనుసరిస్తుంది. అవినీతిని నిర్మూలించి సేవల బట్వాడా యంత్రాంగాన్ని ప్రజల ముంగిటకు తెచ్చేందుకు ప్రభావవంతమైన, సమర్థవంతమైన చర్యలు చేపడుతుంది. రాష్ట్రాన్ని అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే ప్రక్రియలో వినూత్న చర్యలు చేరివున్నాయి. ఇవి ఇతర రాష్ట్రాలు అనుసరించేందుకు ఆదర్శప్రాయంగా ఉంటాయి.

మొదట, మునుపటి పాలనా నియమాలకు విరుద్ధంగా, నా ప్రభుత్వం పూర్తి స్థాయిలో పారదర్శకతను, జవాబుదారీతనాన్ని అగ్రస్థానంపై ఉంచుతుంది. ఈ దిశలో ప్రధాన చర్యగా నా ప్రభుత్వం ప్రప్రథమంగా రాష్ట్రంలో దర్యాప్తులను నిర్వహించేందుకు సిబిఐకి గత ప్రభుత్వం ఉపసంహరించిన సాధారణ సమ్మతిని పునరుద్ధరించింది.

రెండవది, నా ప్రభుత్వం పూర్తి పారదర్శకతను విశ్వసిస్తుంది. దీనిని కట్టుదిట్టం చేయడానికి, ఇప్పటివరకు వినని చర్యగా టెండర్లను ఇవ్వడానికి ముందే ప్రతి భారీ టెండరును పరిశీలించేందుకు జ్యుడిషియల్ కమీషన్ సహాయాన్ని నా ప్రభుత్వం