పుట:ఉభయసభలనుద్దేశించి ఆంధ్రప్రదేశ్ గవర్నరు ప్రసంగము 2019-06-14.pdf/2

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉభయ సభలనుద్దేశించి రాష్ట్ర గవర్నరు గారి ప్రసంగం


మాన్యశ్రీ శాసనమండలి అధ్యక్షులు, మాన్యశ్రీ శాసన సభాపతి,

గౌరన శాసనమండలి సభ్యులు, గౌరవ శాసవసభ సభ్యులు,

అందరికీ నా శుభాభివందనములు.

ముందుగా, రాష్ట్ర శాసనసభకు ఎన్నికైన మీ అందరికీ నా శుభాకాంక్షలు. 2019 సాధారణ ఎన్నికల తర్వాత ఏర్పడిన కొత్త ప్రభుత్వానికి నా అభినందనలు. అందరికీ స్వాగతం, సుస్వాగతం.

సుస్థిరత, పారదర్శకత, అభివృద్ధిని కాంక్షిస్తూ రాష్ట్ర ప్రజలు విజ్ఞతతో తమ ఓటు హక్కు వినియోగించి, ప్రజలందరికి సేవ చేసే అవకాశం మనకు కల్పించారు.

నూతన ప్రభుత్వానికి తక్షణ సమస్యలపై దృష్టిపెట్టాల్సిన సమయం ఆసన్నమయింది. వాటిలో కొన్ని రాష్ట్ర విభజన పర్యవసానంగా ఏర్పడినవి. మిగిలినవి విభజనానంతరం తలెత్తిన సవాళ్ళ అసంగతమైన నిర్వహణకు పర్యవసానాలుగా ఉన్నాయి. మానవ మరియు భౌతిక వనరుల రెండింటిని దుర్వినియోగపర్చడం రాష్ట్రం యొక్క దుస్థితిని మరింత తీవ్రతరం చేసింది. నా ప్రభుత్వానికి దాదాపు ఖాళీ ఖజానా సంక్రమించినందున ప్రజా ధనాన్ని మరియు అన్ని సహాయక వనరులను పూర్తి జవాబుదారీగా, సమర్ధవంతంగా ఖర్చు చేయాల్సిన అవసరం ఏర్పడింది. అయినప్పటికీ, సమస్యలను అధిగమించి, రాష్ట్ర ప్రజానీకానికి సంతృప్తికరమైన ప్రజా సేవలు అందించేటట్లు చూడగలమని నా ప్రభుత్వం విశ్వసిస్తున్నది.