పుట:ఉపదేశ రత్నములు మలయాళ స్వామి 1948.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

4


మును సంపాదించుటకు తపించువాడు క్షత్రియు డనబడును. ఆత్మ సామ్రాజ్యమును సంపాదించి, శాంతము, దయ, సమత్వము, ఆత్మ శాంతి గల్గియుండువాడు బ్రాహ్మణుడని చెప్పబడును.


6. సమానముగా జూచుట యనగా” కుంభవర్షములోను, గాఢమంచులోను ఎప్పుడు నిలచియుండుట యని యర్థముగాదు. మజేమనగా, సామాన్యమైన ఎండ వాన లకు కలతపడకుండా అనుష్ఠానము నిర్వహించుటయని భావము.


7. "ప్రజ్ఞానం బ్రహ్మ” అను భావము తెలిసినవారు ఆ స్థితిలో నుండి జారిపోవుటకు కారణ మేమనగా ఎవని మనస్సు దుస్సంకల్పములనుండియు, దుశ్చింతలనుండియు వెనుకకు మరల లేదో, మహావాక్యబోధయందు సమాధానస్థితి గలుగ లేదో, అట్టివారికి ప్రజ్ఞానబ్రహ్మమందు నిలుకడ గలుగనేరదు. శుభా శుభ ద్వంద్వవిషయములలో నుంచి వేరై, ఆత్మస్వరూపము నందు ఉపరతిని పొందినవారికే ప్రజ్ఞానం బ్రహ్మ అను మహా వాక్యమందు నిలుకడ గల్గును. ఇట్టిజ్ఞానము గలిగినవారు శుభ కర్మల నొకవేళ త్యజించినను త్యజింపవచ్చును, తక్కిన వారు త్యజింపరాదు.


8. ద్వంద్వములతో గూడిన సంసారమునందుండి విము క్తిని పొందదలంచినవాడు కేవల జ్ఞానయోగము చేతనే ఆత్మ సాక్షాత్కారమును పొందవలయును. అట్లుగాక, జపతపయోగ మార్గములచేత మనస్సును నిలుపదలంచినవారు ఎటువంటివా.. రనగా కొందరు పిల్ల వాండ్రు ప్రవాహమందున్న పడవమీద ఎక్కి గూర్చుండి ఆపడవ ప్రవాహములో కొట్టుకొని పోవు