పుట:ఉపదేశ రత్నములు మలయాళ స్వామి 1948.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3

ఓం

తత్
సత్
శ్రీ సద్గురుమూర్తయే నమః

ఉపదేశరత్నములు

1. మహత్తరమైన పుణ్యము చేతనే మానవజన్మము దొరకుచున్నది. అయినను, ఇదియు నొక బుద్బుదము వంటి దనియే యని యెఱుంగవలయును. ఇట్టి మహత్తరమైన జన్మమును కాలము వ్యర్ధముగా పోనీయక, పరమాత్మ ధ్యానమునందు గడపుటయే ఉత్త ములయొక్క ముఖ్యలక్షణము. కాలముయొక్క విలువ తెలియనివారినేఅజ్ఞులని మహనీయులైన విజ్ఞులు చెప్పుదురు.
2. ప్రకృతిగుణములైన కామాదులను సంపూర్ణముగా 'జయించుటయే ఆత్మసామ్రాజ్యమును పొందుటయగును. ప్రపం చము నందందరిని మెప్పించినీ వే కార్యమునుఁ చేయజాలవు, కావున, సత్యమునుండి చలింపక నీయనుష్ఠానము నిర్విఘ్నముగా సల్పుము.
3. నీహృదయము శాంతినొందక, నీలోపలప్రకృతి శమించకముందే నీవు శిష్యులను సంపాదించకుము. సంపాదించి నచో శాంతి గలుగనేరదు.
4. నీటిలో పడవయుండవచ్చునుగాని, పడవలోనికి నీరు రాకుండునట్లు చూడవలయును. అటే, సంసారములో నీవు యుండవచ్చునుగాని, నీలోపల సంసార ముండరాదు.

5. ధర్మనిషకు భయపడి, దేహపోషణసుఖమునే,

జూచుకొనువాడు శూద్రు డనబడును. ఇంద్రియములను జయించు టకు శక్తి లేక భయపడి, ధర్మయుక్త మైన సంసారము గోరువాడు వైశ్యు డనబడును. ఇంద్రియశత్రువులను జయించి, ఆత్మ రాజ్య