పుట:ఉపదేశ రత్నములు మలయాళ స్వామి 1948.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

5

చుండగా నాపిల్లవాండ్రు పడవ కమర్చియున్న అడ్డకొయ్యలను బట్టుకొని ఆపడలంచిన నెట్లుండునో అట్యని తెలియవలెను.

9. స్వప్రయత్నము లేకుండా వచ్చిన సుఖదుఃఖములు ప్రారబ్ద మనబడును. కర్తృత్వముతోగూడి చేసిన కర్మలు ప్రారబ్ధమని చెప్పవీలు లేదు, ఎట్లనగా, అధికముగా భుజించినందున జబ్బువచ్చినచో నది ప్రారబ్ధమనుట మంచిదిగాదు.

10. ఎవరు చక్కగా చదువుకొందురో, వారికి గొప్ప ఉద్యోగము వచ్చుచున్నది. చదువుకొనకపోయినచో ఉద్యోగము, వంశాచారముగా రానేరదు కదా! అట్లే ఎవరు బ్రహ్మమును తెలుసుకొనుచున్నారో వారికి మాత్రము బ్రాహ్మణత్వము వచ్చుచున్నదిగాని, బ్రహ్మమును తెలుసుకొనకుండానే వంశాచారముగా బ్రాహ్మణత్వము రాజాలదు.

11. ప్రజలను మోసపుచ్చు వేషములు వేసి, భక్తునివలె నటింపబోకుము.

సత్యమునుండి జారి ప్రజలను మెప్పించి నీవు సంతసింప దలంచకుము.

తనలోయున్న ఆత్మను గాంచలేనివాడు సర్వులలోనున్న ఆత్మను ఎట్లు చూడగలడు?

విషయచింత ఎప్పుడు గలిగినదో, అప్పుడే ఆత్మవినాశనమునకు హేతువని తెలియవలెను.

12. ప్రకృతిసంబంధమువలన గల్గుసుఖము సాలంబ సుఖమనబడును. సర్వప్రకృతి శమించిన తదుపరి కలుగు సచ్చిదానందసుఖము నిరాలంబసుఖ మనబడును.