పుట:ఉపదేశ రత్నములు మలయాళ స్వామి 1948.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

51

దాటజాలడు. ముష్ఠివి తనము బెట్టి, మధురఫలను నుగోరువాడు ఎట్టి మూఢుడో దుష్కర్మలుజేసి సుఖమును గోరువాడు కూడా అటి మూఢుడేయని తెలియవలెను.

128. స్వామి వివేకానందుని ఒక వృద్ధుడు ఇట్లు ప్రశ్నిం చెను_నాకు ముగ్గురు భార్యలుండియు నన్ను ఇంకా విషయా పేజీ బాధించుచున్న దే మీూరుమంచి యౌవనవంతులుర య్యును బ్రహ్మ చర్యమును ఎట్లు పాలించుచున్నారని ప్రశ్నించెను. అందుకు వివేకానందు లిట్లనిరి. రైలుపోవుచుండగా పెట్టెలుబట్టుకొని ఎంత మంచి నిలుపజూచినను ఎట్లునిలువజాలదో ఇంజనుయొక్క రహ 3 స్యము దెలిసిన డ్రైవరు ఒక్కసారి బ్రేకు నొక్కినచో యా బండి యంతయు నాగిపోవునుగదా అట్లే ఆత్మస్వరూపమును పొందిన వారికి సర్వేంద్రియనిగ్రహము స్వయముగా నేగల్గును. ఆత్మ స్వరూపమును పొందనివారు ఇంద్రియములను నిగ్రహము చేయుట కష్టసాధ్యము.

129. స్వప్రయత్నము లేకుండా వచ్చిన సుఖదుఃఖములు ప్రారబ్ధ మనబడునుగాని క ర్తృత్వముతో గూడి చేసిన కర్మములు, ప్రారబ్ధమనుటతప్పు. అధికముగా భుజించి జబ్బు వచ్చినచో ప్రారబ్ధ మనుటమంచిదిగాదు.

130. మునియనగా మౌనముగా యుండువాడని అర్ధము గాదు. మననము చేయువాడే ముని యని చెప్పబడును.

11. వృద్ధిబొందదగు జీవునికి తనలోయుండు తప్పు న్నియు తనకు ప్రత్యక్షముగా ముగా గానుపించుచుండును. క్షీణదశకు పోవుజీవులకు ఎదుటివారి తప్పు లగుపడుచుండునుగాని, తనలోని తప్పు ఒక్కటైనను గానుపించనేరదు.