పుట:ఉపదేశ రత్నములు మలయాళ స్వామి 1948.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

50

బడిన ఆత్మతత్వమును తెలుసుకొనవలయునంటే ఎంతకాలము తపస్సు చేయవలయునో తెలుసుకొనవలయును. సాంఖ్య యోగ క ర్తయగు కపిలమహర్షి అట్టి ఆత్మత త్వమును తెలుసుకొనుటకై పాతాళలోకమునందు తపస్సు చేసినట్లు సగర చక్రవర్తి వృత్తాం al తమువలన తేట తెల్లముగా దెలియుచున్నప్పటికిని కొందఱు గురువులు తపస్సు అవసరము లేదని చెప్పువారు ఎంత ప్రజా వంతులో తెలిసికొనవలసియున్నది.

126. రైలు ఇంజను మొట్టమొదట కేవలజడముగా యుండును. అట్టిజడమైన ఇంజనుకు షుమారు మూడుగంటల కాలము నిప్పును, నీరును వేసి రగుల్కొల్సినచో అది స్టీముగా మారి అనగా చైతన్యముగల్గి కేవల జడములైన అనేక పెట్టెలను లాగుకొని అతి వేగముగా పోగలుగుచున్నది. అట్లే మొట్ట మొదట జ్ఞానహీను డైన మానవుడు తన మనో ఇంద్రియములను ఏకా గ్రము చేయుటకై నిర్జనప్రదేశమందు జేరి షుమారు మూడు సంవత్సరములైనను నిష్ఠాగరిష్ఠుడై తీవ్రమైన తపస్సు జేసినచో స్టీముగలిగిన ఇంజకువలె గొప్ప చైతన్యముగల్గి తాను తఱించు యేను తటింపజేయునని తెలియవలెను.

127. సృష్టిలో ఒక రహస్యముగలదు. ఎట్లన కారణం వినా కార్యమెచ్చట నుండబోదు. ఒక వృక్షమునుండి వచ్చిన, ఫలపుష్పాదులనుజూచి ఇట్టి వైపరీత్య మంతయు యా వృక్షము యొక్క బీజమునందే నిగూఢమైయున్నదని, ఎట్లు గ్రహించు దుమో, అట్లే మానవుడైనవాడు, పూర్వజన్మమునందు ఏకర్మలు చేయునో యా కర్మఫలము తప్పక అనుభవింపవలయును. తననీడను తాను నెట్టి వేయజాలనట్లు తనకర్మను గూడా తాను