పుట:ఉపదేశ రత్నములు మలయాళ స్వామి 1948.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

49

తలంచుచున్నాను. ఎందువల్ల ననగా శిష్యులని తలంచినచో నేను గురువుననెడి అహము గలుగునేమో యని తలంచుచున్నాను.

123. ఒక్కనాడొక భక్తుడు నావద్దకు వచ్చి ఇట్లు ప్రశ్నిం చెను. మీకు భగవంతుడగుపడినాడా యనెను అందుకు నేనిటు చెప్పితిని. నాకు భగవంతుడు ఇప్పుడే అగుపడవ లెనని చింత లేదు. మరేమనగా భగవంతుడు జెప్పిన ధర్మప్రకారము సర్వా వస్థలయందును నడువ లేక పోవుచున్నానే యని చింతయే నాకు కలదని జవాబు చెప్పితిని.

124. కొందరు సాధకులు యోగాభ్యాసాదుల చేత తల వేడియు కన్నులుమంటలు కలిగినవని నూనెలతో తలలంటు కొనుచుందురు. నేను ఇంటివద్దనున్నప్పుడు పదిసంవత్సర ముల వయస్సులో శిరస్సునకు చముడు పెట్టుకొంటినేమోగాని మరల ఇప్పటివరకు నాతలకు చమురు పెట్టుకొని ఎరుగును; అయినను నాకు శిరస్సుగాని నేత్రములుగాని వేడిచేయుటయే లేదు.

125. సాంఖ్యయోగమును విచారణ చేయువారు కొందరు ఇరువదినాలుగు తత్వములనగా ఇవి. వీటివిషయములివి. ఆయా ఇంద్రియములకు ఆయా విషయములు స్వభావములు. వాని యన్నింటికిని నేను సాక్షినని తెలుసుకొనుటయే చాలునని చెప్పు చుందురు. గాని ఈ త త్వములయందులీన మై త్రిగుణములుగలవని ఎఱిగి వాటిని రహితముచేయుటకు ప్రయత్నము చేయుట లేదు. ఇచ్చటనే వారు పొరపాటుబడుచున్నారని తెలుసుకొనవలయును. పంచీకరణము సర్వము కంఠస్థము చేయవలయునంటే కొన్ని దినము లలో చేసుకొనవచ్చును. గాని, నేతి నేతిమహా వాక్యములలో చెప్ప

5