పుట:ఉపదేశ రత్నములు మలయాళ స్వామి 1948.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

48

భిక్షనిచ్చువారుండరుగదా! తుదకు మంచినీరైనను ఇచ్చునా రుండబోరని బాగుగా తెలియవలెను.

119. పరమాత్మ నాచేత ఏమేమికార్యములు చేయించు టకై పుట్టించినాడో ఆయా కార్యములన్నియు నాచే చేయించి నాడు. ఇకను నేను ఏ గ్రంథములను వ్రాయదలంచ లేదు. ఆఖరున నిర్వాణనిలయమను గ్రంథముతో సంపూర్ణ మైనది.

120. భగవద్గీతయందు కొన్ని శ్లోకములు నా స్తికత్వము నకు అర్థమిచ్చుచుండును. తెలియనట్టివారు కొందరు నా స్తికత్వ మునే సిద్ధాంతము చేయు చుందురు. గీతయందు ఆస్తికత్వమే బోధించుచున్నది గాని నా స్తికత్వము ఎచ్చటను చెప్పబడ లేదు. గాన చక్కగా తెలిసినవారిచేతనే శ్రవణము చేయవలయును.

121. లోకములో మలయాళ స్వాములవారు సాక్షాత్తు అవతార పురుషుడు. కేవలం వ్యాసావతారమని అనేకు లనే కరీతులు ననుకొనుచుందురు. అదియంతయు నేనొప్పుకొనను. నేనున్నూ వివలెనే పుట్టినాను వివలెనే పెరిగినాను. అయితే బాల్యమున బాగుగా చదివినాను. పసితనమునందే వైరాగ్య ముగల్గి సంసారమునుండి విడుదలయైతిని. ఇంతటి అభివృద్ధికి కారణమేమనగా నేను కష్టపడి చేసిన శాస్త్రాభ్యాసము చేతను తపోధ్యానాదులచేతను నేను వృద్ధికి వచ్చినానని తెలియవ లెను. మీ రందఱుకూడా అదేప్రకారముగా దీక్ష కంకణులై తపస్సు చేసినచో మీరందరును మహాత్ములయ్యెదరని నమ్మవ లెను.

122. ఇప్పుడు వ్యాసాశ్రమమునకు అనేకమంది భక్త సంఘమున్నారు. ఇంతవరకు ఒక్క రైనను నాకు శిష్యులని నేననుకొన లేదు. ఏలననగా వారలందరిని మన సోదరులనియే