పుట:ఉపదేశ రత్నములు మలయాళ స్వామి 1948.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

47

రాక్షస గ్రహములయందు పుట్టినవారు పుణ్య కార్యము లెచ్చటనైనను జేయుచున్నచో వానిని విఘ్నముచేయుటయే వారికి పనిగావుండును. కావున పరమేశ్వరుని ధ్యానము జేసినచో రాక్ష సజన్మము తొలిగిపోయి దైవజన్మము వచ్చును.

శ్రీ స్వాములవారి జీవిత వాక్యములు

117. నేను బాల్యమున బడిలో చదువుకొనునప్పుడు అహోరాత్రములు చదువుట గాక బడికిబోవు మార్గములోకూడా చదువుచునే పోవుచుండెడివాడను. నేను చదువవలసిన పాఠమే గాక యా గ్రంథమంతయును కంఠస్థము జేసుకొనియుంచు వాడను. ఇప్పుడు మనశిష్యులలో ఉత్తముడని చెప్పబడువాడు తనజీవిత మంతయు చేయుధ్యాననిష్ఠలన్నియు నేనొక్కనాడు ఒక్క ఘంటకాలములో జేసినంత తపస్సు జేయజాలరని చెప్పు. చున్నాను. కాబట్టి మీకు చేయు స్వల్పనిష్ఠలకే మీరు గర్వించవద్దు.

118. ఇప్పుడు ఈ చాతుర్మాస్యములలో రాజభోజన ములు దొరుకుటయు, వస్త్రములును, దక్షిణలును, నమస్కార పూజాగౌరవములు ఇవన్నియు జరుగుటయు మనయొక్క తపస్సువలనని సాధువు లెవ్వరును గర్వించకూడదు. ఏలనన ఇదంతయు మన పూర్వులైన మహర్షులయొక్క తపోమహిమయే గాని ఇతర మేమియు కాదు. గాన సాధువులైనవారు వారివారి గౌరవము పోగొట్టుకొనక మన తదనంతరము వచ్చు సాధుపరం పరలకు గౌరవ ముండేలాగున వర్తించవలెను. అట్లు గాక స్వేచ్ఛాపరులై అనాచారులైనచో ఈ ప్రపంచములో మనకు