పుట:ఉపదేశ రత్నములు మలయాళ స్వామి 1948.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

45

115. బ్రహ్మోపదేశము జేసుకొనదలచిన వారెల్లరు కూడా మత్తువస్తువులను మాంసాహారమును వాడకూడదు. అట్టి మత్తుపదార్థములకు అలవాటు పడినవా రీ క్రింది సాధన ములచే వాటిని విసర్జించవలయును. కల్లు అలవాటుగలవారు తెల్ల ఉమ్మెత్తాకులరసము కల్లులో కలిపి తాగినచో ఆ యలవాటు పోవును.

గంజాయి త్రాగువారు తుమ్మియాకును గంజాయివ లె నలిపి చిలుములో వేసి పీల్చినచో ఆ యలవాటు పోవును. నశ్యము అలవాటుపడినవారు సొంటిపొడి పీల్చినచో ఆ అలవాటు పోవును.

మత్స్యమాంసములను తినువారు కుళ్లి పురుగులు బట్టి నవి నమలినచో ఆ యలవాటు పోవును. ఈ మత్తుపదార్దముల ద్వారా. గలుగు యానందమునకు సాలంబానందమని పేరు. దీనిని మఱగినవారు నిరాలంబసుఖమునకు దూరులగుదురని ప్రతిముక్షువు ముఖ్యముగా గమనించవ లెను.

116. జోతిశ్చక్ర మునందు ఇరువదేడు నక్షత్రము లుండును. అందు తొమ్మిది నక్షత్రములు దేవతాంశములనియు, తొమ్మిది నక్షత్రములు మానవాంశములనియు తొమ్మిది నక్షత్రములు రాక్షసాంశములనియు చెప్పబడుచున్నవి. వీనిలో దైవనక్షత్రములయందు పుట్టినవారు మంచి పుణ్య కార్యములు తాము చేయుటయందును ఇతరులచే చేయించుటవల్లను మహా నందము పొందుచుందుదురు. మానవ గ్రహములలో పుట్టిన వారు పుణ్యకార్యము చేయుటయందు అపేక్షయును విరోధ మును రెండును లేక యూరకుందురు.