పుట:ఉపదేశ రత్నములు మలయాళ స్వామి 1948.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

52

132. సర్ప విషమువలన చేదువస్తువులు తియ్యగా గను పించును, జ్వరము చేత తియ్యనివస్తువు చేదుగా గాన్పించును. అట్లే తమోగుణస్తులకు అశాస్త్రీయమంతయు శాస్త్రీయముగా గను

133. ప్రతిమనుజుడును ఎవ్వరికైనను ఒక వస్తువు ఇచ్చి నను ఇతరుల చేత తీసుకొన్నను ఎడమచేతితో ఇచ్చుటయు పుచ్చుకొనుటయు తగదు. ఏలననగా అట్లుచేయుట నిర్ల క్ష్యమును అగౌరవమును సూచించుచుండును. అందువలన ఎదుటి వారిని గౌరవించుచు పూజ్యభావమును చూపవలెనుగాని నిర్లక్ష్యము చేయదగదు. ఇదియు వంశాచారమును బట్టి వచ్చుచుండును.

134. నాకు పంచదారయంటే బహు ప్రేమగా యుండును; గాని తీపుయంటే నాకు ఇష్టము లేదు. అన్నట్లు కొందఱు శిష్యులు మాకు గురువుయంటే సాక్షాత్తు పరమాత్మ భావము యుండును గాని; వారు చెప్పు పనులు మాత్రము మాకు కష్టము గలుగు చుండును. అంతేకాని మజేమియు లేదు అని చెప్పుచుందురు.

135. ప్రపంచములో ప్రతిసాధువునకును తాము తాము జగద్గురు వులము కావ లెననియేయందురు. అట్లుకావలెనం ఎప్పుడు వారి దేహేంద్రియాదులకు, వారు వారు సర్వాధికారులగుచున్నా రో అప్పుడు వారు జగద్గురువులగుటకు ఏలాటి సంశయము లేదు.

136. ఒక మానవుడు దుష్టత్వమునుండి విడివడి సత్సం గుడై తఱించి పూర్ణుడైన వాడు, మర లాదుష్ట కార్యమును చేయ జాలడు. ఎట్లనగా కుమ్మరిసారెను గట్టిగా త్రిప్పి కుండను చేసి దించివేసినను యాచక్రము ఏ వైపునకు తిరుగుచుండెనో యావై పున కేతిరుగుచుండునుగాని ఎప్పుడును ఎదరుతిరిగినడువ నేరదుగదా!