పుట:ఉపదేశ రత్నములు మలయాళ స్వామి 1948.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

41

105. మూగ వానికికూడ భోజనముయొక్క రుచులున్నూ, తృప్తియు సంపూర్ణముగా దెలియును. కాని, వానినిగురించి విమర్శించి ఇతరులకు మాత్రము చెప్పజాలడు. అట్లే పెద్దల చేత ఆత్మస్వరూప సాక్షాత్కారముపొంది తృప్తి జెందవచ్చును. కాని, ఇతరులకు బోధించవలయునన్న విద్య లేనివాడు మూగ వాడగు చున్నాడు. లోకోద్ధరణ జేయవలయునన్న విద్య తప్పక యుండవలయును.

106. ఎవడు సర్వవిజ్ఞానస్వరూపుడై బ్రదికియుండియు శవమురీతిగా సర్వవ్యవహారరహితు డగుచున్నాడో వాడు సంపూర్ణమగు కైవల్యమును పొందిన వాడగుచున్నాడు. ఇట్లండగా కొందరు అనేక వికారములు పొందుచు, ఇంద్రియములు 3 వాటివాటి కార్యములు జేయుచున్నవిగాని ఆత్మస్వరూపుడనై న నా కేమి సంబంధము లేదని జెప్పుదురు. ఆత్మయందు సంకల్పము లేకున్న కార్యము గల్గుటకే వీలు లేదు. అందువలన వారివారి హృదయములు వారు వారే చూచుకొని బాగుచేసుకొనవలెను.

107. ఒక స్త్రీకి వివాహము గాక మునుపు ఏకీర్త్యపకీర్తు లుండునో అవి పుట్టినింటివారి కేవచ్చుచున్నవి. వివాహమైనప్పటి నుండియు ఆమెయొక్కకీ ర్త్యపకీర్తులు భర్తవంశమువారి కేవచ్చు చున్నవి. అట్లే గురువువద్ద జేరనివాని కీర్త్యపకీర్తులు వానికిన్నీ వాని బంధువులకున్నూ పోవుచుండును. ఉపదేశ మైన వెనుక వాని కీ ర్యపకీర్తులు గురువుగారికి వచ్చుచుండును. కనుక శిష్యు లై నట్టివారు గురువునకు కీర్తి తేవలెను గాని అపకీర్తి తేరాదు.

108. యుగమునుబట్టి మానవునిమనస్సు మారుచుండునా లేక మనస్సును బట్టి యుగములు మారుచుండునా అని సందేహ