పుట:ఉపదేశ రత్నములు మలయాళ స్వామి 1948.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

40

102. జాగ్రదవస్థలో నీ హృదయము పరిశుభ్రమైన దియు లేనిదియు తెలియవ లెనంటే స్వప్నావస్థలో స్పష్టముగా తెలియవచ్చును. ఎట్లనగా స్వప్నావస్థ ఎప్పుడు పరిశుద్ధమగునో అవస్థలన్నియు పవిత్రమైనట్లేయని తెలియవలెను. స్వప్నా వస్థలో ఏవైన లోపము లుండినచో జాగ్రదావస్థకు వచ్చిన తక్షణమే పశ్చాత్తాపము జెంది ప్రాయశ్చిత్తము జేసుకొన వ లెను.

103. ప్రపంచములో జార, చోర, హింసాది కూర కార్యములు జేయునట్టి దుష్టాత్ములను శిక్షించుటకే పోలీసు వారు ఏర్పడిరి. అందువల్లనే వారికి ఎఱ్ఱని టోపీలును ఎర్రని డ్రస్సులును ఉండుటకు కారణమైయున్నది. అట్లే సూక్ష్మ దేహమునందును కూడా కామ క్రోధాది చోరులు జ్ఞానధనమును దొంగలించుటకు సమయము జూచుచున్నారు. అట్టి అంతరంగ చోరులను పట్టుకొని శిక్షించుటకే సాధువులందరును ఎర్రని రంగు గుడ్డలను ధరించుటకు కారణమని తెలియవలెను.

104. దక్షిణ దేశమంతయు గుళ్లు గోపురములు మహ త్తర 3 ముగా కట్టించినారు. ఉత్తర దేశమందు గుళ్లు గోపురములు కొద్దిగా కట్టించి మఠములను, ఎక్కువగా నిర్మించిసాధుపోషణల విద్యాపోషణలను విశేషముగా గావించుచున్నారు. అనేక గుళ్లు గోపురములు కట్టించుటకంటె బాగుగా నిష్ఠ జేసుకొనెడి ఒక్క సాధువును పోషించడమో లేక గొప్ప విద్యాపాఠశాలల నిర్మించడమో మేలు. అయితే గుళ్లు గోపురములు లేకుండ చేయ మని అర్థముకాదు, కొద్దిగా యుండిన చాలును.