పుట:ఉపదేశ రత్నములు మలయాళ స్వామి 1948.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

39

99. గీతను చదువు ప్రతివారున్నూ గీతావాక్యములు సాక్షాత్తుగా శ్రీకృష్ణభగవానులముఖుమునుండియే వచ్చుచున్న వని భావింపుచు తాను నిజముగా అర్జనుడేననియు భావించవల యును. గీతాశ్లోకములు ఏడువందలవక్కటికి ఎన్ని అక్షరములుం డునో అన్ని లక్షలమారులు గీతను చదివినచో అప్పుడు మీకు గీత యొక్క సంపూర్ణ సారభూతార్ధము తెలియగలదు. అట్లు చదువు ఎన్ని జన్మలకు పూర్తియానో అప్పటివఱకు బూరుగీతను చదవండి. అప్పుడు మీకు గీతాసిద్ధి తప్పక కలుగును.

100. సాధకునికి అపరిగ్రహమెందుకు విధిం చెననగా సాధ కుడైనవా డొకడు తనసాధనను వీడి ఏదో ఒక సత్కార్యమారం భించి ధనవంతుల నాశ్రయించి అతడు భ క్తితో ఇచ్చినదానిచే తృప్తిజెందక అతనిని లోభియనియు, త్యాగి కాదనియు, తానను కొన్నంత ఇవ్వ లేదనియు వానిని నిందించుచున్నాడు. నిరాశ పరుడుగా యుండవలసిన తనకు ఆశగల్గుటయు, దాతలు ఇచ్చిన ధనముచే తృప్తి లేక పోవుటయు ఇన్ని దోషములు తనయందుంచు ది కొని యాదోషములు ఇతరులపైకే వేయుట మహాపాపమగును. అందువలన అపరిగ్రహము విధింపబడెను.

101. మఱిగింజలో నుండి మొక్క బయలు దేరునప్పుడు ముందు రెండాకులతో చిన్నదిగా బయలు దేరును. అది క్రమ క్రమముగా మహావృక్ష మై అనేక జీవులకు ఆశ్రయమై ఫలము లను, నీడను యిచ్చుచు, సంరక్షించుచున్నది. అట్లే విద్యలోగాని భ క్తిలోగాని ఉపన్యాసములు చేయుటలోగాని మెల్లమెల్లగా వృద్ధియై కొంతకాలమునకు గొప్ప స్థితికి రాగలు గుదురు.