పుట:ఉపదేశ రత్నములు మలయాళ స్వామి 1948.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

38

96. ఒక్క సిమెంటుదిమ్మ పోతపోసి ఎండబెట్టి ఆవిద నీటిలో పడవేసినచో అది నానాటికి మహాగట్టి దేలుచుండును. అట్లుగాక పచ్చి దె నచో నీటిలో కరగిపోవును. మఱియు మట్టితో జేసినకుండయు కాల్చకనే పచ్చిది నీళ్ళలో బెట్టినచో నీళ్లలో కరగిపోవును. కాల్చినకుండయైనచో చెడిపోక నిలిచియుండును. అలాగుననే బోధకులైనవారు జ్ఞానాగ్నిచే కాలినవారైనచో బాగుపడెదరు. లేకున్న వీరుకూడా లోకములో కలిసిపోయెదరు.

97. ప్రపంచములో అన్ని ఖండములకన్నను భరత ఖండము పవిత్రమైనదని చెప్పబడుచున్నది. ఎందువల్లననగా తక్కిన దేశములన్నియు భోగ దేశములనియు, భరతఖండ మొక్క టియే యోగదేశమనియు ప్రఖ్యాతి. ఇదియునుగాక తక్కిన దేశములలో మాంసాహారులు అధికులనియు, భరతఖండ మున మాంసాహారులు స్వల్పమనియు శాకాహారు లధికులనియు అందువలన భరతఖండము పవిత్రమైనదని చెప్పబడెను.

98. వివేకానందుడు అమెరికాకు పోయినప్పుడు అచ్చటి గొప్ప తెలివిగల్గినవారు ఇట్లు ప్రశ్నించిరి. మీ దేశస్థులకును మా దేశస్థులకును ఏమిభేదమని యడిగిరి. అందుకు వివేకానందు డిట్లనెను. పోవుటకు శక్యముగానటువంటి హిమవద్గిరి శిఖరము పై రత్నములగని యున్నదని తెలిసినచో అది ఎంతకష్ట ప్రయాస మనను లెక్కచేయక ఆ శిఖరముమీదికి పోదురు మీ దేశ స్థులు. అట్టి మేరుశిఖరముపై ఒక్క మహాఋషి పుంగవు డున్నా డని తెలిసినచో ఎంతప్రయాసకైనను ఓర్చి పోజూతురు మా వారు. ఇదియే మీకు మాకు గల వ్యత్యసమని ఒక్క వాక్య ముతో జవాబు చెప్పిరి.