పుట:ఉపదేశ రత్నములు మలయాళ స్వామి 1948.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

37

93. బ్రతికియున్నప్పుడు హృదయము ఏయే కోర్కెలతో యు౦డునో అంత్య కాలమునందుకూడా అట్లే యుండును. అందు చేత వానికి అందుకు తగిన జన్మ మే వచ్చుచున్నది. బ్రతికియుండి నప్పుడు మంచిపుణ్యకార్యములు చేసియుండినచో వానికి మరణ కాలమునందు ధైర్యము గలుగుచున్నది. పాపకార్యములు జేసి యున్నచో వానికి అధైర్యము భయము, దుఃఖములు గలుగు చున్నవి.

91. బంగారును కొనువారు ఒఱపు వేయుట చేతను, నఱ కుటచేతను, సుత్తెతో కొట్టుట చేతను, తుదకు కరగించుట చేత కు ఇట్లు నాలుగురకములుగా పరీక్షించి కొనుచున్నారు. అటే 3 అభ్యాసకుడు తనహృదయమును నాలుగు విధములుగా పరీక్షించి తెలుసుకొనవలయును. ఎట్లనగా ప్రవర్తనచేతను, భోజనాదుల చేతను, వాక్కు చేతను, సంకల్పములచేతను తెలుసుకొనవలయును

95. ఒక రాతి గుండును కొండమీదికి ఎక్కించుట ఎంత కష్టమో మనస్సును అమనస్క స్థితికి తీసుకొనిపోవుటయు అంత కష్టమని తెలియవలెను. రాతిగుండును ఒక వేళ మహాకష్టపడి కొండశిఖరభాగమునకు దీసికొనిపోయినను, కొంచెముదూర ముండగా విడిపి చినను దొర్లె క్రిందికివచ్చి చేరును అట్లే ఒక 3 పెద్ద యోడమీద కూర్చుండి విదేశమునకు ప్రయాణము చేయుచు ఆవలిగట్టు ఫర్లాంగుయుండగా ఓడ పగిలిపోయినను అందరును మునిగిపోవుదురుకదా; గాన మనస్సు యెడ బహుజాగ్రత్తగలిగి -యుండవలయును.