పుట:ఉపదేశ రత్నములు మలయాళ స్వామి 1948.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

36

ఫలించి అనేకముగా గానుపించుచుండగా అజ్ఞానులైనవారుఅనేక మందిగా వ్యవహరించి భయాశ్చర్యములు' బొందుచున్నారు.

90. పూజాజపధ్యాన ప్ర్రాణాయామాదులు చేయుటయు వేషభాషలను ధరించుటయు, పెద్ద ప్రయాసకరములు గానే చేయుటకు మెదడుతో ఎక్కువగా పని లేదు. రవు. ఈ కార్యములు చేయుటకు మెదడుతో, సామాన్యులుకూడా చేయవచ్చును. కష్టతరమైన కార్య మేది యనగా కనబడునట్టి జగత్తును లేనిదానినిగాను, కనబడని బ్రహ్మ మును ఉన్నదానినిగాను జూచుటయందు మహాస్త్రజ్ఞ కావలసి వచ్చుచున్నది.

91. నీళ్లమీదనడచుటయు, ఆకాశమునందునడచుటయు, జలమధ్యమునందు, అగ్ని మధ్యమునందు యుండుట, మొదలైన అనేకమహత్తులను సంపాదించవచ్చునుగాని మనస్సు యొక్క వృత్తులను నిర్మూలింపజేసి నిర్వికల్ప సమాధియందుండుట మహా కష్టమని శాస్త్రములును, ఋషి పుంగవులును జెప్పుచుండగా కొందరు సాధువులు ము కిసానము బహుసుళువనిచెప్పుచున్నారు. అట్టివారి వాక్యములను నమ్ముటకు ఎట్లు వీలగును? అయితే, మోక్షము మహాకష్టమైనదని ఎవ్వరునూ నిరుత్సాహము పొంద కూడదు. అది చిరకాలాభ్యాసమువలన దొరక బడుచున్నది.

92. ఒకడు పెద్దగుంటలో పడియుండియు నాచేత పెద్ద లాంతరు వెలుగుచున్నదని చెప్పినచో ఎవ్వరు నమ్ముదురు,లాంతరు చేతిలో వెలుగుచుండినచో గుంటలో పడుట ఏలకలుగును? అటే ఒకడు కేవల దుష్ప్రవృత్తులు కలిగి పాపకార్యములు జేయుచు నేను జ్ఞానినని చెప్పుకొనుట కేవలము అవమానకరమగుచున్నది.