పుట:ఉపదేశ రత్నములు మలయాళ స్వామి 1948.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

35

86. ఏగింజయైనను పైన పొట్టు యున్నంతవఱకు మొలక వచ్చుచునే యుండును. ఎప్పుడు పొట్టు తీసివేసెదమో అప్పటి నుండి బీజము రానేరదు. ఆప్రకార మే జీవునికి శరీరత్రయములనెడి పొట్టు ఎంతవఱ కుండునో అంతవరకును జన్మము వచ్చుచునేయుండును, ఎప్పుడు శరీరత్రయములను విచారణ ద్వారా సంపూర్ణముగా తీసివే యుదుమో అప్పుడే జన్మ రాహిత్యమగును.

87. యుద్దములో విరోధులను జయించుటకైనచో అనేక ఆయుధములు కావ లెను; గాని తన ప్ర్రాణములు తీసుకొనుట కైనచో ఒక్క చిన్న కత్తియే చాలునుగదా! అట్లే అనేక సందేహ ములు గల్గి, తర్క వితర్కములు చేయువారికి అనంతవిచార ము కావ లెనుగాని సందేహములు లేనివారికి ఒక్క విచారణ వాక్యమే చాలు.

88. ఆత్మానాత్మ లను విభజించి తెలుసుకున్నంతమాత్ర ముననే మోక్షము వచ్చునెడల పూర్వ కాల మహర్షులు వేల సంవత్సరములు ఎందుకు తపస్సు చేయవలయును? అందుచేత హృదయాంతర్గతమందున్న సర్వవాసనలును, వృత్తులును సంపూర్ణముగా తీసివేయక ముక్తి రానేరదని తెలుసుకొన వలయును.

89. ఒక యింటి యందు నిలువు టద్దము యుండెను. ఆయింటి పసిబిడ్డ యొక డానిలువుటద్ద ముయొద్దకు వచ్చిఅద్దమునం దగుపడుచున్న తనప్రతిబింబమును జూచి మరియొక బాలునిగా దలంచి యా బాలునితో యాడుకొనుచు సంతోషించుచుండెను. అట్లే ఒక్క ఆత్మయే అనేక అంతఃకరణోపాధులయందు ప్రతి