పుట:ఉపదేశ రత్నములు మలయాళ స్వామి 1948.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

84

నచో ఉభయులకును భ్రష్టత కలుగును. అదెట్లనిన, అన్నము వండదలంచినప్పుడు అన్నియు ఎండుక లైనచో సులభముగాను, త్వరితముగాను, పాకమగునేకాని అట్లుగాక కొన్ని ఎండుకు లును, కొన్ని పచ్చిక లైనచో వండువారికి ప్రయాసమే గాక ఆలస్యముగూడా యగుచున్నది గదా !

84. ఏ ప్రకారము సూర్యోదయానికి ముందు అరుణో దయమగునట్లు, హృదయపరిశుద్ధత గల్లి సిద్ధులు గలుగ బోవుటకు ముందు కొన్ని దృష్టాంతములు గల్గును. ఎట్లనగా జాగ్రదావస్థ లోగాని, స్వప్నావస్థలోగాని, తనకు గల్గిన సంకల్పము లన్నియు సత్యములై ఫలించుచుండును.

85. భగవద్గీతయందు శ్రీకృష్ణ భగవానులు ఇట్లు చెప్పిరి. అర్జునా! వీరందరును నాచే హతులైయున్నారు. అయి నను నీచే వీరిని జంపించి నీకు కీ ర్తియిప్పించదలచు చున్నానని చెప్పెను. అందువలన ఎవ్వరైనను కొన్ని ఘనకార్యము ” చేసి నను లేక చేయించినను, నేనే ఈ కార్యములను జేసినాననియు ఈ కార్యములు జరుగుటకు నాయొక్కశక్తియే కారణమనియు అహంకరించినచో వాడు తప్పక పతనము జెందును. గాన, నేను జేయు కార్యములన్నియు మాగురు దేవుని దయయేయని గాని, స ర్వే శ్వరుడే నామీద దయయుంచి నాచే ఈ కార్యములను జేయిం చుచున్నాడనిగాని ఎఱింగి ఎవ్వడు నిమి త్తమాత్రుడై జేయునో వాడు ఉన్నతస్థితికి వచ్చును. పురోభివృద్ధిని పొందగోరువాడు పూర్వ వృత్తాంతమును మరువకూడదు.