పుట:ఉపదేశ రత్నములు మలయాళ స్వామి 1948.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

42

మొక్కటి యుండును. ఇందుకు జవాబేమనగా మనస్సును బట్టియే కాలము మారుచుండునని చెప్పబడును. అట్లుగాక యుగమే కారణమని చెప్పినచో పుణ్యవంతమని చెప్పబడు కృత యుగమునందు హిరణ్యాక్ష, హిరణ్యకశిపాది మహాదుర్మార్గు లుండినట్లు వినుచున్నాము. కలియుగము పాపస్వరూపమైనచో బుద్ధ, శంకర, రామానుజ, మధ్వాది మహా పుణ్య పురుషులు లుండినట్లు వినుచున్నాము. కృతయుగము పుణ్యవంతమైనచో ఆయుగమువా రందరును పుణ్యాత్ము లేయై యుండవలెను. కలియుగము పాపరూపమైనచో ఆ కాలము వారందరును పాపు లయ్యే యుండవలెను. అట్లుగాక, మిశ్ర మిశ్రమ మైయు౦డుటనుబట్టి యుగములవలన మనకు మేలు కీడులు లేవనియు వారివారి జ్ఞానాజ్ఞానములును ప్రజ్ఞాప్రజ్ఞలే ముఖ్యకారణములని తేలు చున్నది. ఇదియునుగాక నవగ్రహములును పంచభూతములును మృగపశుపక్ష్యాదులును షడ్రుచులును వృక్షఫలాదులన్ని యు కృతయుగమునం చెట్లున్నవని శాస్త్రములు చెప్పుచున్నవో కలి యుగములో కూడా ఏలాటిమార్పు లేకుండా అట్లే యుంటున్నవి. ఇట్లుండగా గొప్ప తెలివిగల్గిన మానవజాతికి కలిపురుషుడెందుకు బట్టెనో తల్లక్రిందులు జే సెనో తెలియకున్నది. కాన అట్లు చెప్ప కూడదు.

109. ఒక ప్రభువు తన ముఖ్యమంత్రినిజూచి నీకు నా నా- యఁడు ఎంత ప్రేమ కలదు అని యడిగెను. ఆవాక్యమును మంత్రి విని చక్కగా యోచించి ఇట్లనెను. ఓ ప్రభువా! నీయందు నాకు కుక్క కున్నంత విశ్వాసమున్నదని చెప్పెను. ఆ వాక్యమును ప్రభువు విని మహాకోపము జెంది నీవు అహంకారివని తోచు