పుట:ఉపదేశ రత్నములు మలయాళ స్వామి 1948.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

31

ఎఱుగనిమార్గమున తానొక్కడే ప్రయాణమైనచో ఎంతకష్టమో ఆరీతిగా యుండును. సద్గురువుద్వారా మోక్షము జెందుట ఎట్లుండుననగా, ఇదివఱకు మార్గము దెలిసినవారితోగూడా ప్రయాణము జేసినచో, ఎంతసులభముగా నుండునో ఆరీతిగా యుండునని తెలియవ లెను. ఈ రెండుమార్గములకును ఇంత తార తమ్య మున్నది.

76. రాజభటుల వద్ద తుపాకులును, కత్తులు, కర్రలు యుండును. అవి యెందుకనగా రాజాజ్ఞను మీరి ప్రవర్తించు దుష్టులను శిక్షించుట కేయగును. అట్లే భగవంతుని చేతులయందు చక్రము, గద మొదలైన ఆయుధము లుండును. అవి ఎందుకనగా ఎవరు దై వాజ్ఞనువిూరి దుష్టులై చరింతురో వారిని శిక్షించుట కే యని తెలియవ లెను.

77. గోవులు సామాన్యముగా సాధుజంతువులగుటవలన పూజించి గౌరవించుచుందురు. అట్లు పూజనీయమైన గోవు లైనను వాటిలో కొన్ని దొంగయావులై దుష్టులైనచో అట్టివానికి మెడకు గుదికొయ్యయు, కాళ్లకు బంధములును, మొద లైనశిక్షలు తప్పక సంభవించుచుండును. అట్లే ఆచార్యపరులైన సాధువులై నచోపూజింపబడుదురు. అనాచారపరులైనచో శిక్షింపబడుదురు.

78. పూర్వకాలపు ఋషులు, ఏమంత్రములను జపించి సిద్ధిపొందిరో ఆమంత్రములనే మన మిప్పుడు చాలకాలము జపము జేసియు, ఏల సిద్ధిపొంద లేదనినచో వారు కేవలము భావ మును ఏకత్వము జేసి జపించిరి. మనము కేవలము వాచామాత్రమే చేయుచున్నాము. కాబట్టియే సిద్ధిపొంద లేదని తెలియవ లెను.