పుట:ఉపదేశ రత్నములు మలయాళ స్వామి 1948.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

32

79. మన దేహముతో మన కెంత సంబంధమున్నదో ప్రపంచముతోకూడా అంతసంబంధ ముండవలయును, అటని కేవలం పంచసంబంధమే ప్రధానమని పెట్టుకొనినచో మన కున్నూ, మృగములకున్నూ భేదమేమి గలదు? మజేమన ప్రపంచ పరమాత్మల రెండింటియందును మానవునికి సంబంధ ముండ వలయును.

80. బుద్ధభగవానులు అమనస్కముగాని సాంఖ్య తార కములుగాని ఎప్పుడును ఎవ్వరికిని బోధించ లేదు. ఎప్పుడును కరుణయు, భూతదయయు, ప్రేమయు, సమరసత్వమును, శాంత మును, నిరాడంబరత్వములనే బోధించిరి. ఇట్టి సుగుణములు లేని వేదాంతము నిష్ఫలమని వారు గ్రహించి అట్లుజేసినారు.

81. ఎవ్వనిహృదయము నందు లవ లేశమైనను దుఃఖ ముంటున్నదో అది అతని పూర్వజన్మ పాపఫలంబని గ్రహించవల యును. ఎవ్వనిహృదయమందు మోక్షము జెందుటకై ఏమహా లక్షణములు కావలయునో అట్టి లక్షణము లన్నియు అచ్చు బోసినట్లు ఏజన్మములో సంపూర్ణముగా ఏర్పడునో వారాజన్మ మునందే ము క్తి జెందుదురు. కొందరు మోక్షముబొందగోరి మహా తీవ్రముగా ధ్యాన మారంభించెదరు. అట్టివారికి వెంటనే శరీర మునకు ఉడుకు జేయుటో మరేదైనను జబ్బుచేసి యోగాటంక మగును, అదేమనగా, పూర్వజన్మ పాపమేయని తలంచవలయును. కాన మోక్షము జెందుటకు అందుకు తగిన ఆరోగ్యమైన దేహమును, సుగుణములు కలుగవలయునుంటే పూర్వ జన్మ పుణ్యఫలము తప్పక యుండవలయును. అట్లు పుణ్యము లేకపోయినచో ఈజన్మమున దైనను సంపాదించవలయును.