పుట:ఉపదేశ రత్నములు మలయాళ స్వామి 1948.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

30

72. ఒకానొకనికి క్రొత్తప్రదేశములకు పోయినప్పుడు తూర్పుపడమరగాను, పడమర తూర్పుగాను కనిపించుచుండును. ఇది అందరికిని అనుభవ మేయగును. అయితే ఎవ్వనికి భ్రమగ లెనో వాని కే అట్లు తారుమారుగా గానుపించునుగాని అచ్చట కాపు రము చేయుచున్న వారందఱికిని అట్లే గాన్పించుచున్నదని చెప్ప దగదు. తక్కినవారందరికిని యదార్థమే గాన్పించుచుండును గదా!

73. మహా వైరాగ్యమును, ఆత్మసాక్షాత్కారమును, గలిగిన గురువు గొరకుట, శిష్యునియొక్క పుణ్య మేయగు చున్నది ఎట్లనగా, రైలు, ఇంజనుకు తగిలించిన పెట్టెలు, అన్నియును. ఇంజనుయొక్క వేగమును బ బటియే పోవుచుండును. కొందరు ప్రయాణీకులు తొందరగా ప్రయాణము చేయవలెనను ఉద్దేశ్యము గల్గియు, నిదానముగా బోవు బండి ఎక్కినచో ఆ ఇంజనుయొక్క వేగము ననుసరించియే రైలుపోవును గాన త్వరగా పోజాలరుగదా ! అట్లే వైరాగ్యము లేని గురువును ఆశ్ర యించినచో శీఘ్రముగా మోక్షమునకు బోజాలరు.

74. సాపాత్మునికి పరమాత్మ విరోధుడుగా గాన్పించును. పుణ్యాత్మునికి ప్రపంచకార్యములు విరోధముగా గాన్పించును. ఎట్లనగా ఒక రోగికి ఎప్పుడు అన్న ముమీద ఇచ్ఛగలు గునో 3 అన్నము రుచించునో అప్పుడువానికి వానిరోగము తగ్గినదని తెలు సుకొనవచ్చును. ఎంతవఱకు అన్న ముమీద ఇచ్ఛయు ఆకలియు రుచియు కలుగ లేదో వానికి రోగము తగ్గ లేదని తెలియవ లెను. 75. భగవంతుడు దయామయుడును జగద్గురుడనియు కూడా చెప్పబడియున్నది. కాన భగవంతునే గురువుగా నమ్ము కొని కడ తేరవచ్చునుగాని, ఆ మార్గ మెట్లుండుననగా ఎన్నడును