పుట:ఉపదేశ రత్నములు మలయాళ స్వామి 1948.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

29

ఒకానొకడు గిల్టు నగలను దెచ్చి, అమాయకులైన మనుజులను మోసము జేసి, బంగారునగలని జెప్పి, విక్రయించినచో అమ్మిన వారికిన్నీ, కొన్న వారికిని అపకీర్తియు, అనేక దుఃఖములును గలు గును. ఆరీతిగానే శుష్క వేదాంతమును నిజవేదాంతమని చెప్పి, అమాయకులను మోసము జేసినచో ఉభయులకును దుఃఖము తప్పదు.

70. సూర్యోదయ కాలమున మన దేహముయొక్క నీడ చాలా పొడవుగా గాన్పించును. సూర్యు డెంతెంత పైకి వచ్చు చుండునో అంతంత నీడ తగ్గితగ్గి తుదకు తన పాదముల క్రిందనే లయమౌను. అట్లే జ్ఞానోదయ ప్రారంభ కాలములో మన మనస్సు ఎంతో పొడవుగాను చాలా పెద్దదిగాను ఘోర భయంకరముగాను గాన్పించును, జ్ఞానసూర్యుడెం తెంత పైకి వచ్చుచుండునో, అంతంత ఈమనోరూపమైన మాయ తగ్గితగ్గి తన స్వస్వరూపమైన పరమాత్మయందే లయించిపోవుచున్నది.

71. తన దేహమునే ఎఱుగ లేని గ్రుడ్డివాడు ఇతరుల దేహముల నెక్లెఱుంగజాలడో, అట్లే తన దేహమునందున్న 3 పరమాత్మను దెలియలేని అజ్ఞాని ఎన్ని నదీనదములు దిరిగినను పరమాత్మను దెలియజాలడు. అట్టి పరమాత్మసాక్షాత్కారము గలుగవలయునంటే పరమేశ్వరుని దయ సంపాదించవలయును. పరమాత్మదయ గలుగవలయునంటే పర పర మేశ్వరుడు లోకమునకు విధించిన దై వాజ్ఞను పాటించినవారి కే తప్ప ఇతరులకు ప్ర్రాప్తించ నేరదు. ఎట్లనగా రాజాజ్ఞను ఉల్లంఘించుచు రాజుయొక్క దయను కోరుట ఎట్లుండునో దైవాజ్ఞయు నట్లేయని ఎఱుంగ వలయును.