పుట:ఉపదేశ రత్నములు మలయాళ స్వామి 1948.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

28

స్థానమువద్దకు ఎవ్వరును ఎట్లు పోజాలరో అట్లే బూటక పుభక్తుల వద్దకు ఎవ్వరునూ రాజాలరు. 67. మనో వాక్కాయములు మూడును పరమాత్మను ఎఱుగజాలవు,ఏలననగా ఈ మూడును జడములు. పరమాత్మ చేతన స్వరూపము అందువలన జడవస్తువులు చేతనమునె టైఱుఁగగలవు 3 అందుచేత పరమాత్మ అవాజ్మానసగోచరుండని చెప్పుటకు కారణమైనది. అట్టి మనోవాక్కాయములకు అతీతమైన పరమాత్మ స్వరూపము అధికారులు గాని వారికి సాధ్యముగాదు. కావున అభ్యాసకులైనవారికి చిత్తశుద్ధిగలుగుటకొఱ కై మహర్షు లై నవారు సగుణారాధనములైన పూజాధ్యాన జపతపయోగాది సాధనములు నిర్మించినారని తెలియవలెను.

68. మాసములలో మార్గశీర్షమాసము శ్రేష్ఠమని భగవ ద్గీతయందు జెప్పబడియున్నది. ఏలనన లోకకల్యాణములై న జపతపములు జేయుటకుగాని యజ్ఞయాగాదులు జేయుటకుగాని ఎండా కాలమున వేడియధిక ముగా నుండును. చలికాలమున చలి అధిక ముగానుండును. అందు చేత ఈ రెండు కాలములును అంత యోగ్య ములు కావు, మార్గశీర్షమాసము శీతోష్ణములకు మధ్యకాల మగుచున్నది. ఇదియునుగాక యజ్ఞములు జేయుటకు కావల సిన ధాన్యములును కూరగాయలును సరస్సులలో సంపూర్ణ జలములును అన్నియు సంపూర్ణముగా నుండును. మార్గశిరమాసము ముఖ్యమని చెప్పబడుటకు కావున కారణమని తెలియవలెను.

69. బజారులో బంగారునగలను అమ్మినచో, అమ్మినవారి కిని కొన్న వారికిని, ఆనందము, గౌరవమును కలుగును. అట్లుగాక