పుట:ఉపదేశ రత్నములు మలయాళ స్వామి 1948.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

27

చదువులన్నియు ఏమాత్రమును లాభము లేదు. అందుచేత చదువు అనవసరమని మేము చెప్పట లేదు. మ రేమనగా రెండును యుండుట మంచిదని చెప్పుచున్నాము. కొందరు కొన్ని ములుమాత్రము చదివి మాకు తల ఉడు కెక్కినది, ఈ శాస్త్రము లన్నియు మాకెందుకు; మాకు మోక్షముకదా కావ లెను అని అనుచుందురు. అది ఎట్లున్నదనగా ఒకరు గొప్పయాకలి బాధతో మా నుండియు, మా యాకలిదీరుటకు ఈ పొయ్యి మెందుకు, నిప్పు నీళ్లు ఎందుకు, ఈ పొగలును సెగలును ఎందుకు, మాకు కావలసినది పిడికె డన్న మేకదా యని అన్నట్లుగా యుండునని తెలియవలెను.

66 లక్షరూపాయలు ఖర్చు బెట్టి ఒక శృంగారమైన గొప్ప దేవాలయము గట్టించి యాగుడిలో దేవునిప్రతిష్ఠ జేయకపోయిన చో యాదేవాలయమును కట్టించినపుణ్యమును, ఆమానవు డెట్లు పొందజాలడో ఆప్రకారముగానే శ్రేష్ఠమైన మానవజన్మము గల్గియు, సకలశాస్త్రములను చదివియు మహాభోగ భాగ్యము లుండియు దివ్యరూప సౌందర్యము దొరికియు తన దేహము నందును సర్వదేహములందును వెలుగుచున్న పరమాత్మను దెలియనివాడు సంపూర్ణమైనమానవజన్మము గలిగిన వాడు కాడు. ఏ దేహమునందు దేవుని ప్రతిష్ఠ జేసుకొనియుందురో అట్టి మహ నీయు లున్న చోట చక్కగా దైవప్రతిష్ఠ జేసిన దేవాలయమువ లె ఎప్పుడును అనేకజనులు కూడి సంతర్పణలు సమారాధనలును, విశేషముగా జరుపుచుందురు. ఎవ్వని హృదయమందు దేవుని ప్రతిష్ఠ జేసియుండ లేదో వారెక్కడయున్నను పాడుబడిన దేవ