పుట:ఉపదేశ రత్నములు మలయాళ స్వామి 1948.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

26

మనెడి వేదశ్రుతినాదము వినుటకై జిజ్ఞాసువులైన జనులుఋష్యా దులవద్దకు వచ్చి వినుచు పోవుచుందురు. 63. ఏకాంత మనగా మనుష్యు లెవ్వరును లేనిచోటని అర్థముకాదు. ఏసంకల్పములు లేని చోటయుండుటే యని అర్ధము. ఏసంకల్పములు లేనిచోట దృష్టియుంచువాడు అనేక మనుష్యు లలో యున్నను వాని కది నిర్జనస్థానమే యగుచున్నది.

సంకల్పములు గలవాడు ఎవ్వరును లేని నిర్జనస్థానమం దున్నను ఎన్ని సంకల్పములు గలుగుచున్నవో అంతమంది మను ష్యులలో యున్నట్లే యగును.

64. ఏ మానవుడు కాలమును నిర్లక్ష్యముగా జూచు చున్నాడోవాడుపరమాత్మనునిర్ల క్ష్యము జేసినవాడగుచున్నాడు. ఎందువల్ల ననగా గీతయందు కాలము నేనని భగవంతుడు చెప్పి యున్నాడు. కావున నీకు భగవంతుడిచ్చియున్న కాలమును వృథా చేయకుము. ఇదిగాక మత్స్యములలో మకరము నేనని చెప్పినాడు. ఎందువల్లననగా సముద్రమునందు మకరమను నొక జాతి చేపలు కలవు. చేపలు వేటాడు వారికి నొక వేళ యామకరమనెడి మీనము వలలో చిక్కినను దానిని వారు చంపక విడిచి వేసెదరు ఎందువల్ల ననగా సూర్యుడుదు ంచునప్పుడుయా చేపతూర్పుగామళ్ళి సూర్య నమస్కారములు జేయుననియు, యెవ్వరా చేపను చంపి తినెదరో వారికుటుంబము నాశనమగుననియు, అన్ని మత్స్య ములవ లె ఈ చేప ఇతర మైన చిన్న చేపలను తరిమి చంప తినదనియు, దానివద్దకు వచ్చిన వాని నేతినుననియు జాలరులు కొంతమంది చెప్పుచున్నారు.

65. నాలుగు వేదములును వేదాంగములును కంఠసముగా చదివినను అనుభవమును ఆచరణయును లేకున్నచో యా