పుట:ఉపదేశ రత్నములు మలయాళ స్వామి 1948.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

25

ఆ నీటియం దాపురుగు యొక్క మాలిన్యమును పోగొట్టు కొనునంతటి విద్యుచ్ఛక్తి లేనందువల్లనే యని తెలియవలెను. ఒక పెద్ద చెఱువునీటియందు గొప్ప చేపగాని లేక మనిషిగానిపడి చనిపోయినచో యా చెఱువు నందున్న విశేష జలములో గొప్ప విద్యుచ్ఛక్తి కి యుండుటవలన యా మలినము హరించి వేయబడు చున్నది. వర్షాకాలమునందు మహానదులన్నియు ప్రవహించు నపుడు అందుఅనేక జీవజంతువులును అనంతకల్మషముకొట్టుకొని వచ్చి చేరినను, సముద్రము ఆ మహాకల్మషమునంతటిని హరింప జేయుచున్నది.అట్టి మహాసముద్రముయొక్క శక్తి పంచపాత్రకు, భావికి, గుంటకు రావలెనన్న ఎట్లు వచ్చును? అట్లే గొప్ప సిద్ధ မှာ పురుషులు జేయునట్టి ఘనకార్యములను జూచి శక్తి లేనివారు అట్టి కార్యములకు పూనుకొన్నచో ప్రయాస గలుగునేగాని అవి ఫలించనేరవు.అందువలన వారివారి శ క్తిని గనిపెట్టి నడుచుకొనుట మంచిది.

62. అరణ్యమునందు వెదురు పొదలుండును. వానిలో ఎండిపోయిన వెదుళ్లకు తుమ్మెదలు రంధ్రములు దొలచును. గాలి బాగుగా దోలునప్పుడు యా వెదురురంధ్రములగుండా మంచి సునాదము బల్కు -చుండును. అప్పుడాయరణ్యమునందున్న జింకలు యా వేణునాదమును విని వెదకులాడుచు గుంపులు గుంపులుగా యా పొదవదకు వచ్చినిలిచి యా నాదానందమును వినుచుండును. ఇంతలో గాలి యాగిపోయినచో యా నాదము నిలిచిపోవును. అప్పుడా జింకలన్నియు వెళ్లి పోవును.మరల ఆ గాలి చేత వేణునాదము బలికినచో వెంటనే జింకలన్నియు వెనుకకు మరలివచ్చి యానాదము వినుచుండును. అట్లే బ్రహ్మానంద