పుట:ఉపదేశ రత్నములు మలయాళ స్వామి 1948.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

24

మిధ్యామాత్రమని సర్వకాల సర్వావస్థల యందును, దృఢ ధ్యానములో నుఁడవ లెను. అట్లుగాక యోగాభ్యాసాదుల చేత, కొంతసేపు దృశ్యరహితస్థితిలో నుండి, మరల వ్యవహార స్థితికి వచ్చినప్పుడు దృశ్యము నన్నేమి చేయునోయను భయ ముండును, ఎట్లనగా, ఒక మనుష్యుడు నాగు బాము యొక్క గట్టిగా పట్టుకొని విడువకున్నను విడిచి పెట్టితే, కంఠమును గట్టిగా కఱచునేమోయను భయ ముండును. అట్లుగాక, పామును సంపూర్ణముగా చంపివేసితే నిర్భయమైనట్లు, ఈదృశ్యము నంతయు సంపూర్తిగా మిధ్యాస్వరూపమని జూచుటో, లేక సర్వము పరమాత్మస్వరూపమేయని గాంచుటో యుండవ లెను.

60. మనుష్యులలో ఆరుతరగతులవారుందురు. అదిఎట్ల నగా మొదటివాడు తనసుఖమునుమాత్రమే తాను చూచుకొను చుండును. రెండవవాడు, తనసుఖమును తనభార్యాబిడ్డలయొక్క సుఖమును మాత్రమే చూచుకొనుచుండును. 3 వ వాడుతనను, తన భార్యాపుత్రాదులనేగాక, తన బంధుమిత్రాదులయొక్క సుఖ మును కూడా చూచుచుండును, నాల్గవ వాడు, తనజాతివా రందరిని ప్రేమించును. అయిదవవాడు తనజాతి వారినే కాక తన దేశము వారందరిని ప్రేమించును. ఆరవ వాడు సర్వజాతులను సర్వ దేశీ యులను అందరిని సమానముగా ప్రేమించును. ఇట్టివారే ఉత్తమమనుజులని చెప్పబడుదురు.

61. జలమునందు విద్యుచ్ఛక్తి కలదు. ఆశక్తి నీటి యొక్క విస్తీర్ణమునుబట్టి యుంటున్నది. ఒక పంచపాత్ర నీటి యందు ఒక చిన్న పురుగు పడినచో యా నీళు పారబోయు చున్నాము. ఎందువల్ల ననగా