పుట:ఉపదేశ రత్నములు మలయాళ స్వామి 1948.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

23

సభామధ్యమున కూర్చున్నప్పుడు సామాన్యముగానే యుందురు. అది ఎట్లనగా, తిరునాళ్లు జరుగు స్థలములలో వీధులయందు గిలైటుసొమ్ములు కుప్పలు కుప్పలుగా ప్రోగులుపోసి అమ్ము 3 చుందురు. బంగారునగలను, రత్నహారములను అటు వీధులలో అమ్మరుగదా! ఆప్రకారముగా ధ్యాననిష్ఠలను సభలలో ప్రదర్శించినచో తపస్సునకు గౌరవము పోగొట్టినవా రగుదురు.

58. ప్రపంచములో మన పిత్రార్జితమునకు ఎవ్వరైన నను అడ్డుదగిలినచో కోర్టుకుపోయి ఎంతకష్టమైనను ఎంతధనము ఖర్చ అయినను పోట్లాడి ఎటు మనపక్షము జేసుకొనుచున్నామో ఆ ప్రకారమే పరబ్రహ్మమైన మోక్షధనమునకై, ఏలకష్టపడుట లేదు. ఈ రెండును మనకు పిత్రార్జితములే యగుచున్నవి. అయితే, ఈ రెంటియందును అధికార మున్నది గాని, మైనరు తీరనివారికిమాత్రము కోర్టువారు ఆస్తిని స్వాధీనము చేయరు. ఆలాగుననే ఎంతవఱకు అజ్ఞానులుగా యుందురో వారు జ్ఞానధన మునకు అధికారులు కానేరరు.

59. ఆత్మకు రెండవవస్తువు యుండునంతవఱకు, దుఃఖ ముండియే తీరును. ఎటనగా, ఎలుకకు పిల్లి యుండునంతవఱకు 3 దుఃఖము తప్పదు. జింకకు పెద్దపులి యుండునంతవఱకు, శోక రహితము గానేరదు. ప్రభువునకు పరప్రభువు యుండువఱకు, చిత్తశాంతి యుండనేరదు. దేవతలకు రాక్షసులుండువఱకు, సౌఖ్యము లేదు. అందుచేత ఆత్మకు ద్వైతభావన యుండునంత వఱకు, చిత్తోపరతి గలుగనేరదు. కాబట్టి పరమాత్మస్వరూపుడ నగు నాకంటే అన్యవస్తువు బొత్తుగా లేదు అని తెలియువఱకు సంపూర్ణానందము లేదు. అందు చేత ఈ సర్వదృశ్యమంతయు