పుట:ఉపదేశ రత్నములు మలయాళ స్వామి 1948.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

22

జేసికొనుట మేలు. అందుకు నీవు అధికారివి కాకపోయినచో నీకు ఏది సుఖమో సర్వజీవులకును అదియే సుఖము. కే దుఃఖమో సర్వజీవులకును అదియే దుఃఖము అని తెలిసి ఏజీవి కిన్ని కొంచెమైనను దుఃఖము గలుగనీయక ప్రవర్తించినచో దేవు డున్నది లేనిది అంతయు నీకే తెలియునని చెప్పిరి.

56. మనువుయొక్క సంతతివారైనందుచేత మానవులని పిలువబడుచున్నారు. అగ్రజాతి మొదలు అంత్యజాతివఱకును ఏ దేశమువార లై నను మానవులని యేపిలువబడుచున్నారు.కులము లనునవి మధ్యలో ఏర్పడినవియే. ఎట్లనగా మహమ్మదు వచ్చి నప్పటినుంచి మహమ్మదు కులమును, క్రీస్తువు వచ్చినది మొదలు క్రైస్తవ కులమును, బుద్ధుడు వచ్చినది మొదలు బౌద్ధ కుల మును,ఇట్లే అనేక శాఖలు మన మెఱిగినంతలోనే ఏర్పడినవిగదా. అట్లే అన్ని కులములును ఆయా కాలములందు ఏర్పడినవే కాని, దైవసృష్టిలో వచ్చినవి కావు. కాబట్టి మానవులందఱును, ఒక్క టే కులముగా యుండవలయుననియే మాయొక్క ముఖ్య ఉద్దేశము, అయితే అందఱును శుచ్యాచారములు మాత్రము చక్కగా కలిగియుండవలయును.

57. ధ్యాననిష్ఠలు ఏకాంతస్థలమునందు కూర్చుండి రహస్యముగా జేయవలయును. కొంద రట్లుగాక, అనేకజనులు కూర్చున్న సభలయందు పద్మాసనము వేసి, నడుము నిక్కించి, వెన్ను విఱచుకొని, నిమీలిత నేత్రులై ఏమో తెలిసిన వారివలె ముందు వెనుకలకు యూగుచుందురు. అట్టి దరు డాంబికులని చెప్పబడుదురు బాగుగా తెలిసిన వారు ఏ కాంత స్థలమునందు రహస్యముగా గొప్పధ్యానము చేసియు, ఒక